RGV : ప్రతీ రోజూ అదే పని చేస్తుంటే విసిగిపోయిన.. రామ్ గోపాల్ వర్మ భార్య ఏం చేసిందో తెలుసా ?

- Advertisement -

RGV .. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఇండియా లెవల్లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు నిరంతరం సోషల్ మీడియాలో కూడా ఆర్జీవీ వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏది మాట్లాడినా వార్తల్లో నిలవాల్సిందే. ఇటు సినీ ఇండస్ట్రీ అటు పొలిటికల్ గా తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు.

directir ram gopal varma shocking comments on cbn and jr ntr
RGV

ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాలకు కేరాఫ్ ఆర్జీవీ. ఎవరెన్ని విమర్శలు చేసిన నా ఇష్టం అంటు జీవించేస్తుంటారు. ఆయనలా బతకాలని ఎంతో మంది తనను ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఈయన సినిమాలతోనే కాదు ఇంటర్వ్యూలో మాట్లాడిన చాలు అది వివాదమే. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన అంశాలపై సినిమాలు తీస్తున్నారు. చాలా మందికి తెలఅయితే రాంగోపాల్ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇది ఇలా ఉంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్శ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ బంధం చాలా కాలం నిలువ లేదు భార్యకు విడాకులు కూడా ఇచ్చారు. అసలు ఆయన ఎందుకు విడాకులు ఇచ్చారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆర్జీవీ చదువుకునే రోజుల్లోనే తన ఫ్రెండ్స్ కు కథలు చెబుతుండేవారు. ఆ కథలు విన్న ఆయన స్నేహితులైతే నా దగ్గర డబ్బులు ఉంటే కచ్చితంగా నిన్ను డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తాననే వారట. చదువు అయిపోయాక ఆర్జీవీ తాజ్ హోటల్ లో పనిచేసేవారు. అప్పట్లో ఆయనకు రూ.800 ల జీతం వచ్చేది. అప్పుడే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సాక్ష్యంగా ఒక పాప కూడా పుట్టింది. ఆయన భార్య పేరు రత్న. అప్పటికే సినిమాలంటే పిచ్చి ఉన్న ఆర్జీవీ చెప్పులరిగేలా సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగేవాడు. కొంత మంది నిర్మాతలకు కూడా కథలు వినిపించారు.

- Advertisement -

అప్పుడే శివ సినిమాకి దర్శకత్వం అవకాశం రావడం అది బ్లాక్ బస్టర్ హిట్ అయి సంచలన దర్శకుడిగా మారాడు. ఆ తరువాత కూడా ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. అయితే సినిమాల మీద మరింత ఇంట్రెస్ట్ పుట్టి వాటి ధ్యాసలోనే నిమగ్నమై పోయేవాడు. ఇంటికి కూడా వచ్చేవాడు కాదట. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎందుకు తాగుతున్నావ్, ఎక్కడికి వెళ్తున్నావ్ అని భార్య నిలదీసి అడిగేదట. కానీ ఆయన సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండేవారట. దాంతో తన భార్యకు కోపం వచ్చి, విసిగిపోయి కూతుర్ని తీసుకొని భర్తకు విడాకులు ఇచ్చిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here