BRO Movie : నిరాశ పర్చిన ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్.. థమన్ పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

- Advertisement -

BRO Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన చిత్రం ఇది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

BRO Movie
BRO Movie

ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించాడు. రీసెంట్ గానే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటని విడుదల చేసింది మూవీ టీం. ఈ పాట ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Pawan Kalyan

‘మై డియర్ మార్కండేయ’ అంటూ మొదలైన ఈ పాట ప్రారంభం లో చాలా బాగుంది కానీ, తర్వాతే ఎందుకో తగ్గుతూ పోయింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా సాయి ధరమ్ తేజ్ కి స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి కానీ, సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్ మాత్రం చాలా స్లో గా అనిపించింది. ఇదే ఫ్యాన్స్ కి చాలా నిరాశకి గురి చేసింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే థమన్ రెచ్చిపోయి మరి మ్యూజిక్ ఇస్తాడు . కానీ ఈ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కి చాలా యావరేజి గా అనిపించింది.

- Advertisement -
Pawan Kalyan in bro movie

ఈ సాంగ్ మధ్యలో ఊర్వశి రౌతేలా ఎంట్రీ ఇవ్వడం తో, ఆమెతో కలిసి సాయి ధరమ్ తేజ్ చిందులు వెయ్యడం పర్వాలేదు అనిపించింది. పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ఆయనకీ స్క్రీన్ స్పేస్ కాసేపు ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, మొత్తానికి ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో అభిమానులను అలరించలేదనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here