Ramyakrishna : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన రమ్యకృష్ణ.. కారణం ఇదే ?

- Advertisement -

Ramyakrishna: సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. తన నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రమ్యకృష్ణ ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ఎంతోమందికి ఆరాధ్య దైవంగా మారింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రమ్యకృష్ణ తాను పడిన బాధలు, ఆమెను సినిమాల నుంచి పక్కన పెట్టిన సంగతుల గురించి తెలుపుతూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ చాలా సెలక్టివ్‌గా తనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. మంచి పాత్ర, పెద్ద సినిమాలకు మాత్రమే ఆమె ప్రియారిటీ ఇస్తుంది. అయితే క్రమంలోనే ఆమె కెరీర్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వెల్లడైంది.

అసలు మేటర్ ఏంటంటే.. రమ్యకృష్ణను చాలా మంది నువ్వు అందంగా ఉన్నావ్.. నువ్వే మా సినిమాలో హీరోయిన్ అంటూ సెలక్ట్ చేసి.. ఆ తర్వాత కారణాలు చెప్పకుండానే తీసేశారట. అది ఆమెకు చాలా బాధగా అనిపించేదంట. తెలుగులో ఇక అవకాశాలు రావు అనుకున్న సమయంలో కె .రాఘవేంద్రరావు తనకు లైఫ్ ఇచ్చారని, అల్లుడు గారు సినిమాకు తనను సెలక్ట్ చేయడం అందులో రెండో హీరోయిన్ అయినా పాత్ర బాగుండటంతో అది ఆమె కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయిందట. ఆ తర్వాత అల్లరి మొగుడు సినిమాలో కూడా అవకాశం ఇచ్చారట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రమ్యకృష్ణకు వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒకానొక సమయంలో స్టేజ్‌పై మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, ఇలా చాలా సార్లు జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి ఈ ఛాన్స్ ఇవ్వడంతో ఇంతగా సక్సెస్ అయ్యానని తెలిపింది. తన వల్లే స్టార్ స్టేజ్‌కు ఎదిగానంటూ.. ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్‌ ఇవ్వలేక స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here