Chandini Chowdary : ఈ కాలంలో కూడా స్త్రీలను లం* అంటున్నారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Chandini Chowdary : యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకుంది చాందినీ చౌదరి. ఆ తర్వాత అనేక సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. మొదటిసారిగా కలర్ ఫొటోలో హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది ఈ తెలుగు బ్యూటీ. ఇటీవలే విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామితో అలరించింది. ఇందులో ఓ కీలక పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పుడు మరొ కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది ఈ బ్యూటీ.

ఇటీవల కాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో నెగెటివిటీ, ట్రోల్స్ గురించి వెంటనే స్పందిస్తున్నారు. ఏమాత్రం వెనకాడకుండా తమ ఉద్దేశాలను కుండబద్దలు కొడుతున్నారు. హీరోయిన్ చాందిని కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంటూ ఓ పోస్ట్ పెట్టింది. అమ్మాయిల నుంచి తాము వినకూడని విషయాలు వింటున్నామంటూనే మగవాళ్ళందరూ వాళ్ళని లం* లేదా దానికి సమానార్థం వచ్చే పదాలతో అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇలాంటి మాటలతో 2024 లో కూడా ఇలాంటి మాటలతో ఆడవాళ్లను తీవ్రంగా హింసిస్తున్నారంటే చాలా బాధేస్తుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతుంది.

- Advertisement -

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది మొహం లేని, పేరు లేని వ్యక్తులు వాళ్లకు నచ్చని వాళ్ల మీద అనేక విధాలుగా కామెంట్స్ చేసే అవకాశం కలిగింది. మన అమ్మల్ని తిడుతూ, చంపుతామని బెదిరిస్తూ అసలు ఏం చెబుదామనుకుంటున్నారు? తమ చుట్టూ ఇలాంటి వాళ్లతో బతుకుతున్న ఆడవాళ్ల గురించి తలుచుకుంటేనే బాధ వేస్తోంది. సోషల్ మీడియాలోనే ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్లు ఇళ్లల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుందంటూ రాసుకొచ్చింది.

చాందిని చౌదరి ఇటీవల ఐపిఎల్ టీమ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ఆంధ్రాకి చెందిన అమ్మాయిని.. కాబట్టి తమ ఆంధ్రాకు ఎలాంటి టీమ్ లేదు కాబట్టి ప్రస్తుతం ఎవరిని సపోర్ట్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చింది. హైదరాబాదులో ఉంటున్నా సరే సన్ రైజర్స్ కుసపోర్ట్ చేసే విషయం మీద ఆమె వెనక్కి తగ్గడంతో ఆ టీం అభిమానులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here