Balakrishna : ఒక్క యాడ్ లో నటించినందుకు బాలయ్య ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా..!

- Advertisement -

Balakrishna : మన పెద్ద హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.

Balakrishna
Balakrishna

బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. దీనితో బాలకృష్ణకి వరుసగా యాడ్ లో నటించే డీల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య ఓ యాడ్ కి బాలయ్య సైన్ చేశారు. పఠాన్ చెరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి సంబందించిన యాడ్ ఇది. దీనికోసం బాలయ్య ఆల్రెడీ ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి కూడా హాజరు కానున్నారట.. అయితే ఆ యాడ్ కోసం బాలయ్య భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Balakrishna photos

ఆ యాడ్ కోసం ఆయన రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా, హోస్ట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, పొలిటీషియన్ గా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here