Prithiveeraj: ప్రముఖ నటుడు పృథ్వి చేతిలో దారుణంగా మోసపోయిన సంఘవి.. అసలు ఆరోజు రాత్రి ఏమి జరిగిందంటే!

- Advertisement -

Prithiveeraj: 1990 నుండి 2000 సంవత్సరం వరకు ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.వారిలో కొంతమంది యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని , ఇండస్ట్రీ లో తమకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరే సంఘవి.హాట్ హీరోయిన్ గా ఆరోజుల్లో ఈమెకి ఉన్న క్రేజ్ వేరు, సుమారుగా దశాబ్దం పాటు ఇండస్ట్రీ లో స్టార్ గా వెలిగిన ఈమె, ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో ఫేడ్ అవుట్ అయ్యింది.

Prithiveeraj
Prithiveeraj

దీనితో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసుకుంటూ మంచి పాపులారిటీ ని సంపాదించింది.ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లో ఈమెకి మీనా, ప్రీత,సంగీత మరియు మహేశ్వరీ వంటి హీరోయిన్స్ ఈమెకి బాగా క్లోజ్.అప్పుడప్పుడు వీళ్ళు గెట్ 2 గెథెర్ ద్వారా కలుసుకుంటూ ఉంటారు.అయితే రీసెంట్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ఈమె ప్రముఖ నటుడు పృద్వి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

sangavi

ఆమె మాట్లాడుతూ ‘ఒకరోజు షూటింగ్ పూర్తి చేసుకొని రాత్రి అందరం ఇంటికి తిరిగి వెళ్తున్నాము, అప్పుడు పృద్వి చాలా చిరాకు గా ఉన్నాడు, ఏమైంది అని అడిగితే నా భార్య గర్భం దాల్చింది.వీళ్ళని కనీసం కేక్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదు అని చెప్పాడు.దీనికి ఎంతో ఆగ్రహించిన నేను, రెస్టారంట్ ఓనర్స్ తో గొడవపడి పృథ్వి కోసం ఒక కేక్ ని ప్యాక్ చేయించి తీసుకొచ్చాను, విమానాశ్రయం లో పృథ్వి తన భార్య తో కలిసి కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను.ఎందుకంటే ఆయన భార్య గర్భం దాల్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు.నేను మీకు ఎన్నో నెల అండీ అని అడిగాను,ఆమె నన్ను విచిత్రం గా చూసింది.అప్పుడు అర్థం అయ్యింది పృథ్వి నన్ను మోసం చేసాడని’ అంటూ సంఘవి ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

privee
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here