Samyuktha : ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో సంయుక్త మెస్మరైజింగ్ లుక్స్

- Advertisement -

Samyuktha ప్రస్తుతం టాలీవుడ్​లో హ్యాప్పెనింగ్ హీరోయిన్. ఈ బ్యూటీ ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అందులో మాస్టారు.. మాస్టారు పాటలో ఈ భామ అందం, అభినయం చూసి తెలుగు కుర్రాళ్లు ముచ్చటపడిపోయారు. తమ కోసమే సంయుక్త పాట పాడుతున్నట్లు భావించి ఊహల్లో తేలిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తలుపు తడుతున్నాయి.

Samyuktha
Samyuktha

తాజాగా ఈ బ్యూటీ విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ చిత్రంలో సంయుక్త సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్​తో నటించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 21న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఏలూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

menon

విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సంయుక్త గ్రీన్ కలర్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో ఎంతో ముద్దుగా కనిపిస్తూ అందరి కళ్లు తనవైపే పడేలా చేసుకుంది. కళ్లు చెదిరే అందంతో మెస్మరైజింగ్ స్మైల్​తో అందర్నీ ఆకర్షించింది సంయుక్త. చూపుతిప్పుకోనివ్వని గ్లామర్​తో ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. ఈ వేడుకలో అందరూ మాట్లాడుతూ సంయుక్తను గోల్డెన్ లెగ్ అంటూ తెగ పొగిడేశారు.

- Advertisement -
samyu

భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది సంయుక్త. ఆ సినిమాలో రానాకు జంటగా నటించింది. ఈ మూవీ ఫంక్షన్​లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక భీమ్లానాయక్ తర్వాత ఈ బ్యూటీ బింబిసారలో నటించింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఇటీవలే సార్ సినిమాతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిన సంయుక్త ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ఆ ఆనవాయితీ కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఆల్ ది బెస్ట్ సంయుక్త.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here