Mahesh Babu: హాస్పటల్లో మహేశ్ బాబు.. డాక్టర్లు ఏమన్నారంటే..!

- Advertisement -

Mahesh Babu అభిమానులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. వారి ఫేవరేట్ హీరో డాక్టర్ ని ఎందుకు కలిశారని అనుకుంటున్నారు. మహేశ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ చేశారు. తన ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ఓ ప్రముఖ డాక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రసుత్తం ఈ ఫొటో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Mahesh Babu
Mahesh Babu

కాగా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్ కి కృతజ్ఞతలు తెలిపారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు . తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫోటో కూడా షేర్ చేశారు. జర్మనీలో ఉన్న ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ కోయినిగ్ ను పరిచయం చేస్తూ.. మహేష్ బాబు ఇలా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు @drharrykoenig! నా ఆరోగ్యం మెరుగైన చేతుల్లో.. అంటూ అతని గురించి ఒక క్యాప్షన్ ఇచ్చారు. మహేష్ చాలా సంవత్సరాలుగా ఈ వైద్యుని సంరక్షణలో ఉన్నార‌ని అతని చికిత్సల నుండి ఎంతో ప్రయోజనం పొందాడని ఇది అర్ధమవుతుంది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులే కాదు సినీ ప్రముఖలంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరి 2024 జనవరి 13 న విడుదల కానుంది.కాగా మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత ద‌ర్శ‌కుడు రాజమౌళితో మరొక సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఆ ప్రాజెక్టుపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమాను దర్శక ధీరుడు హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్లో తెరపైకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కథ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే వర్క్ షాప్ మొదలుపెట్టే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2024 సమ్మర్లో స్టార్ట్ అవ్వచ్చు అని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here