సంపూర్ణేష్ బాబు సుడి తిరిగిందిగా.. త్వరలో మెగాస్టార్ ని కూడా తొక్కేస్తాడేమో..టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు టాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో తన కొత్త సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్‌తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు. అలాగే ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు.

పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు కీరిటంతో కనిపిస్తుండగా.. ఆ కిరీటంలో పొలిటికల్ లీడర్స్, కాంపెయిన్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక పోస్టర్ బట్టి చూస్తుంటే.. మూవీ పొలిటికల్ జోనర్ తో ఉండబోతుందని అర్ధమవుతుంది. అంతేకాదు ఈ మూవీ ఒక సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా రాబోతుందని సమాచారం. 2021లో తమిళంలో తెరకెక్కిన పొలిటికల్ సెటైర్ మూవీ ‘మండేలా’ కి ఇది రీమేక్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ అవార్డుకు కూడా ఎంపిక అయ్యింది.

అలాంటి ఈ చిత్రాన్ని సంపూర్ణేష్ బాబు ఇప్పుడు రీమేక్ చేస్తుండడంతో మంచి ఆసక్తే నెలకుంది. అయితే దీనిని పూర్తి రీమేక్ చిత్రంగా కాకుండా మెయిన్ పాయింట్ ని మాత్రం తీసుకోని పూజా కొల్లూరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో నరేష్, డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలు చేస్తున్నారు. అక్టోబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ కూడా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ చిత్రంతో సంపూర్ణేష్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.