Mahesh Babu : ‘భోళా శంకర్’ నిర్మాతలకు మహేష్ బాబు ఆర్ధిక సహాయం..ఇంత మంచి మనసు ఎవరికీ ఉండదు!

- Advertisement -

Mahesh Babu : నాలుగు దశాబ్దాల మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క హీరో పాన్ ఇండియా రేంజ్ స్టాండర్డ్స్ ని మైంటైన్ చేస్తూ సినిమాలు తీస్తుంటే, మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి రీమేక్ సినిమాలు తీయ్యడాన్ని ప్రేక్షకులు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

Mahesh Babu
Mahesh Babu

ఇది చిరంజీవికి ఎంతో అవమానకరమైన ఫలితం అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది వేసవిలో నిర్మాత అనిల్ సుంకర కి ‘ఏజెంట్’ చిత్రం కారణం గా దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది. ఈ చిత్రం ఏ రేంజ్ ఫ్లాప్ అంటే కనీసం ఓటీటీ విడుదలకు కూడా నోచుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన చిన్న చిత్రం ‘సమజవరగమనా’ భారీ హిట్ గా నిలిచి అనిల్ సుంకర కి కాస్త ఊపిరి తీసుకునేలా చేసింది.

హమ్మయ్య లాభాలు వచ్చాయి అని ఆనందించే లోపే, ఆయన నిర్మాణ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్‘ చిత్రం రీసెంట్ గా విడుదలై ఆయనకీ మరో 50 కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించింది. ఇక ఒక్క ఏడాది లోనే దాదాపుగా వంద కోట్ల రూపాయిల నష్టాలను చూసాడు అనిల్ సుంకర. అవతల ఈయన సినిమాలను కొన్న బయ్యర్స్ మాకు నష్టాలను భర్తీ చెయ్యండి, ఎంతో కొంత డబ్బు తిరిగి ఇవ్వండి అంటూ అనిల్ సుంకర ని టార్చర్ చేసారు.

- Advertisement -

అయితే రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ సుంకర కి కాల్ చేసి మాట్లాడాడు అట. అనిల్ ప్రస్తుతం తానూ ఎదురుకుంటున్న పరిస్థితి ని మొత్తం వివరించగా, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, నీతో ఒక సినిమా ఉచితంగా చేసి పెడతాను, కంగారు పడకు అని అన్నాడట. కష్టసమయం లో మహేష్ ఆ మాట అనడం తో అనిల్ సుంకర కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యిందట. మహేష్ బాబు తో ఇప్పటి వరకు ఈయన దూకుడు, ఆగడు, 1 నేనొక్కడినే మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలను నిర్మించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here