టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమంత అందరికీ సుపరిచితమే. మొన్నటిదాకా మాయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ని తీసుకుంది సమంత దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేసింది. ఆమె చెప్పినట్లు ఏడాది పూర్తి అవడంతో మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. దీనిలో భాగంగా ఒక వైపు ఫిట్నెస్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకోపక్క సినిమాలని కూడా చేస్తోంది మయోసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుండి పూర్తిగా కోల్కున్న సమంత ఇప్పుడు పూర్తిస్థాయిలో యాక్టివ్ గా మారింది. ప్రస్తుతం రీయంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ హాట్ ఫోటోలని కూడా పంచుకుంటూ ఉంటుంది. హెల్త్ కి సంబంధించిన టిప్స్ ని కూడా ఫ్యాన్స్ కి ఇస్తూ ఉంటుంది తాజాగా హెల్త్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసింది. కానీ ఒక నెటిజెన్ మాత్రం ఈ వీడియోకి వింత ప్రశ్న అడిగాడు. నటి సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో ఒకటయ్యారు.
కొన్ని కారణాల వలన విడిపోయారు. అభిమానులకి కోల్కోలేని షాక్ తగిలింది ఇప్పటికి వీళ్ళ ఇద్దరూ కలిసి పోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక నెటిజన్ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేశారు అని అన్నారు. ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ అయింది. యోగా కి సంబంధించిన ఒక వీడియోని కూడా సమంత పోస్ట్ చేసింది అందులో తను రోజు చేసే మెడిటేషన్ టైమింగ్స్ గురించి చెప్పుకొచ్చింది.