Akkineni Nagarjuna – RGV కాంబో లో రావాల్సిన సినిమా ఎందుకు మిస్ అయింది..?

- Advertisement -

Akkineni Nagarjuna – RGV  : శివ మూవీ తో భారీ సక్సెస్ ని అందుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా తో వచ్చిన సక్సెస్ వలన ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఈయన చేసిన ప్రతి మూవీ కూడా ప్రేక్షకులలో విపరీతమైన సంపాదించుకుంది. పైగా చాలా సంవత్సరాల పాటు రాంగోపాల్ వర్మ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన మొదటి సినిమా చేసిన నాగార్జునతో ఇప్పటిదాకా మూడు నాలుగు సినిమాలు చేశాడు. అయితే నాగార్జున తో చేయాల్సిన ఒక మూవీని మాత్రం నాగర్జునతో కాకుండా మరో హీరో తో చేసి సక్సెస్ ని అందుకున్నారు. అదే జగపతిబాబు రేవతి హీరో హీరోయిన్లు గా వచ్చిన గాయం సినిమా.

ఈ సినిమాని మొదట్లో నాగర్జునతో చేయాలని ఆర్జీవి అనుకున్నారు. ఆ విషయాన్ని నాగార్జునకి కూడా చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ జగపతి బాబుతో చేసి సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాదు జగపతిబాబు కెరియర్ కూడా టర్న్ అయిపోయింది. ఈ దెబ్బతో జగపతిబాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చాలా ఏళ్ల పాటు కొనసాగించారు.

మొత్తానికి ఆర్జీవీ నాగార్జునకి హ్యాండిచ్చి జగపతిబాబు ఒక సినిమా చేసి సూపర్ హిట్ ని అందుకున్నారు. నాగార్జున ఆర్జీవితో కొద్దిరోజులు పాటు మాట్లాడలేదు. కానీ మొత్తానికి ఫైనల్ గా మళ్ళీ ఆర్జీవి నాగార్జున ఒప్పించి ఆయనతో ఇంకో సినిమా చేస్తున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి వీళ్ళ కాంబోలో రెండేళ్ల క్రితం ఆఫీసర్ అనే మూవీ వచ్చింది ఈ సినిమా ఆశించిని విధంగా విజయాన్ని అందుకోలేదు ఈ సినిమా వలన నాగార్జున మార్కెట్ భారీగా డౌన్ అయిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here