Samantha : తన క్రష్ సినిమాలో సమంతకు చాన్స్.. ఫుల్ హ్యాపీ అవుతోన్న ఫ్యాన్స్..

- Advertisement -

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే మూవీ ఏంటనేది పెద్ద చర్చగా మారింది. ఈక్రమంలోనే బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ పేర్లు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఏది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న టాక్ ఎంటంటే.. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అట్లీతోనే అని. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే..

ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత.. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇక అల్లు అర్జున్‌తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించారు.

- Advertisement -

ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తుంది. గతంలో ఓ సందర్భంగా అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని సమంత చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సూర్య పిక్చర్స్ నిర్మించబోతుందట. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here