Samantha : సమంత ఏంజిల్ లుక్.. దివి నుంచి దిగివచ్చావా అని పాడుకుంటున్న కుర్రాళ్లు

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత బయట సందడి చేసింది. ఇవాళ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారిని సందర్శించి సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది. శాకుంతలం టీమ్ తో కలిసి అమ్మవారిని దర్శించుకుంది.

ఇక సమంత ఇవాళ వైట్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. వైట్ కలర్ అనార్కలీ డ్రెస్సులో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో సామ్ దేవకన్యలా ఉంది. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సమంత ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

Samantha

సమంత తాజా ఫొటోలు చూసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ ఏంజిల్ ఆరోగ్యంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. సామ్ ఈజ్ బ్యాక్ ఆన్ ఫామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో నెట్టింట సందడి చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్ లో సామ్ చాలా అందంగా కనిపిస్తుందంటూ పొగిడేస్తున్నారు.

- Advertisement -
Samantha at peddamma talli temple
Samantha

ఇక సామ్ శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ లో కూడా వైట్ కలర్ శారీలో కనిపించింది. రీసెంట్ గా శాకుంతలం సినిమా చూసినప్పుడు కూడా తెలుగు డ్రెస్సులోనే సందడి చేసింది. ఇక ఇవాళ అమ్మవారి దర్శనానికి కూడా వైట్ డ్రెస్సే వేసుకువచ్చింది.

Smaantha photos
Samantha

ఇది చూసిన నెటిజన్లు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సామ్ వైట్ కలర్ ఔట్ ఫిట్స్ లోనే కనిపిస్తుందని ఫిక్స్ అయ్యారు. అయితే సమంతను ఇప్పటి నుంచి దేవకన్యలా చూడొచ్చని కుర్రాళ్లు మురిసిపోతున్నారు. చీర, అనార్కలీ, సల్వార్ కమీజ్.. ఇలా ఇప్పటికే పలు రకాల వైట్ కలర్ ఔట్ ఫిట్స్ లో కనిపించిన సామ్.. ఈ ప్రమోషన్స్ లో ఇంకా ఎలాంటి ఔట్ ఫిట్స్ ధరిస్తుందోనని అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

samantha sakunthalam

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత సమంత తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో సామ్ సరసన విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో సమంత వరుణ్ ధావన్ తో కలిసి సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here