ఎవరూ ఊహించని పని చేసిన సమంత.. టాలీవుడ్ తో అవసరం తీరిపోయిందిట

- Advertisement -

చిత్రసీమలో పదిహేనేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అగ్ర కథానాయిక సమంత. దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. అనారోగ్యం బారిన పడినప్పటికి ధైర్యంగా పోరాటం సాగించి కోలుకుంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సమంత
సమంత

అది అలా ఉంటే సమంత హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. సమంత.. చైన్నె స్టోరీ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన హాలీవుడ్‌ నటుడు వివేక్‌ కల్రా హీరోగా నటించనున్నారు. దీనికి ఫిలిప్‌ జాన్‌ అనే ఆయన దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన యువకుడికి, చైన్నెకు చెందిన అమ్మాయితో జరిగే ప్రేమకథ అని తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనున్నట్లు టాక్.

samantha

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. యశోద లాంటీ సూపర్ హిట్ తర్వాత సమంత శాకుంతలం అనే ఓ పౌరాణికంలో నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్’‌గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. మంచి అంచనాల నడుమ సుమారు 60‍కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here