Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య శోభిత ధూళిపాల డేటింగ్ పై తాను స్పందించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ స్పష్టం చేసింది.. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతా రియాక్షన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు..

నాకేం అవసరం. ప్రేమ అంటే విలువ లేని వారు.. ప్రేమకి అర్థం తెలియని వారు.. ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి కన్నీళ్లే మిగులుతాయి, కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటే చాలు. ఇప్పటికైనా బిహేవియర్ మార్చుకుని ఆ అమ్మాయిని బాధపెట్టకుండా చూసుకుంటే బెటర్ అని సమంత తన సన్నిహితులతో చెప్పినట్లు గ్రేట్ ఆంధ్రా.. శోభిత నాగచైతన్య డేటింగ్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ ని క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఆ రూమర్ పై సమంత స్పందించింది సమంత స్పందన పై గ్రేట్ ఆంధ్ర లో వచ్చిన కథనాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో ట్యాగ్ చేసింది.. నేను దీన్ని ఎప్పుడూ చెప్పలేదు.. అని క్లారిటీ ఇచ్చింది. సమంత చెప్పకపోయినా ఆమె చెప్పినట్లుగా వార్తలు క్రియేట్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు సోషల్ మీడియా వాళ్ళు..
సమంత చేసిన కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నీ మీద మాకు నమ్మకం ఉంది సమంత. నువ్వు ఎప్పుడూ ఇలా చేయవు పలువురిని నిందించవు అంటూ.. సామ్ అభిమానులు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. నీ గురించి ఏంటో మాకు తెలుసు అంటూ తనకి మద్దతుగా నిలుస్తున్నారు.
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023