Samantha : బ్రాండ్ మేడం బ్రాండ్.. సమంత ధరించిన ఈ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్!!

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేం చేయడం లేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇటీవలే తన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. దీనికోసం వరుస ఫొటోషూట్లు చేస్తోంది. ఇక తన స్టైలింగ్ తో అభిమానులను ఫుల్ ఖుష్ చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచేస్తూ.. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ మేడం సర్ మేడం అంతే అనేలా ఫొటోలు పోస్ట్ చేస్తోంది.

Samantha
Samantha

స‌మంత స్టైలింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ హీరోయిన్లలో బెస్ట్ స్టైలింగ్ అంటే సామ్ దే అని చెప్పొచ్చు. అకేషన్ గా తగ్గట్టుగా తన స్టైలింగ్ ఉంటుంది.  ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో సామ్ ఎప్పుడూ కాస్త ముందే ఉంటుంది. స్టైల్ కా బాప్ అని అనిపించిన సందర్భాలెన్నో. ఇటీవలే సిటాడెల్ ప్రమోషన్స్ కోసం  సామ్ ఓ ఫొటో షూట్ చేసింది. వైట్ కలర్ గూచీ జాకెట్ అండ్ షార్ట్ స్కర్ట్ లో ఈ భామ మత్తెక్కించే పోజులు ఇచ్చింది. ఈ ఔట్ ఫిట్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా వజ్రాలు పొదిగిన ఓ వాచ్ ను ధరించింది. ఈ ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది.

Samantha watch

- Advertisement -

సామ్ పోస్టు చేసిన ఫొటోల్లో ఈ భామ అందంతో పాటు తన ఔట్ ఫిట్, యాక్సెసరీస్ కూడా నెటిజన్లను బాగా ఆకర్షించాయి. అందులోనూ సామ్ తన చేతికి ధరించిన బల్గారీ సర్పెంటా అనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండెడ్ వాచీ మరింత అట్రాక్ట్ చేసింది. షైన్ అవుతూ సర్పం ఆకారంలో మెలికలు తిరుగుతూ ఉన్న ఈ వాచ్ ఇంట్రెస్టింగ్ గా కనిపించడంతో నెటిజన్లు దాని ధర ఎంత ఉందో తెలుసుకుందామని నెట్టింట సర్చ్ చేశారు. కానీ ధర చూశాక వాళ్ల గుండె జారిపోయిందట. ఇంతకీ ఈ వాచ్ ధర ఎంతో తెలుసా

ఈ వాచ్ ధర అక్షరాల రూ.80 లక్షల రూపాయలట. ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. గతంలో ఇదే కంపెనీకి చెందిన జ్యువెలరీతో సామ్ కనిపించింది. ఏదేమైనా సమంత వాచీ చూసి.. ఇది అమ్మితే బ్యాచ్ బ్యాచే సెటిలైపోవచ్చని నెటిజన్స్ ఫన్నీ కౌంటర్స్ వేస్తున్నారు. మరోవైపు ఈ వాచ్ చాలా అందంగా ఉందని, ఆ మాత్రం ధర ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా సమంత ధరించిన వాచ్ తన అందాన్ని డబుల్ చేసిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here