Devara Item Song : ఆమె పరిస్థితి ఇలా అయిందేంటి భయ్యా.. అప్పుడు ఎన్టీఆర్ తో మెయిన్ లీడ్ ఇప్పుడు దేవరలో ఐటెం సాంగ్

- Advertisement -

Devara Item Song : పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. తొలి భాగం అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బీ టౌన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాజు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వీళ్ల లుక్స్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడంతో సూపర్ బజ్ క్రియేట్ అయింది.

Devara Item Song
Devara Item Song

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మరో కీలక అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందట. కొరటాల శివ సినిమాలో ఐటెం సాంగ్ అంటే కాస్త కొత్త విషయమే. అయితే ఈ ప్రత్యేక సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ మెరవబోతోందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?

- Advertisement -

టాలీవుడ్ బుట్టబొమ్మ.. గత రెండేళ్ల క్రితం వరకు నిర్మాతల గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పూజ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకప్పుడు అరవింద సమేత మూవీలో తారక్ పక్కన మెయిన్ లీడ్ నటించిన పూజ ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయాల్సి వస్తోందా అంటూ తెగ ఫీల్ అవుతున్నారట.

కానీ మరికొంత మంది మాత్రం కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే రంగస్థలం మూవీలో జిగేల్ రాణి పాటలో మెరిసి దుమ్ము లేపిందని, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పూజకు స్పెషల్ మంచి ఛాన్సే అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత మళ్లీ పూజను మనం తెరపై చూడబోతున్నామన్న మాట. ఈ భామ చివరగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీలో కనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here