Samantha : కొత్త ఇల్లు కొన్న సమంత.. ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

- Advertisement -

తెలుగు స్టార్ హీరోయిన్ Samantha కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాప్ హీరోయిన్ లలో మొదటగా వినిపించే పేరు..మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి కొద్దిరోజుల్లోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగింది. అలాంటి ఈ హీరోయిన్ అక్కినేని ఇంటికి ఎప్పుడైతే కోడలుగా వెళ్ళిందో అప్పటినుండి ఈమె రేంజే మారిపోయింది.

కానీ ఏవో గొడవల వల్ల విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరిని బాధపెట్టారు. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య కి దూరమైనప్పటినుండి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. అంతే కాదు ఇప్పుడు కోట్లు విలువ చేసే కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చింది..

samantha
samantha

ఇటీవల ఈమె నటించిన యశోద సినిమా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈమె నటించిన మరో లేడి ఓరియెంటెడ్ సినిమా శాకుంతలం రిలీజ్ కి రెడీగా ఉంది.ఈ మధ్యనే సమంత మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడి ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంది. ప్రస్తుతం సిటాడల్, ఖుషి సినిమాల షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతుంది.తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. హైదరాబాద్ లోనో, కేరళలో కాదు..ముంబైలో..

- Advertisement -
samantha Photos

అది బాగా రిచ్ ఏరియా.. ఈ మధ్య కాలంలో తన సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సన్ సెట్ కి సంబంధించిన ఒక ఫోటోను సమంత పెట్టింది. ఇక ఈ ఫోటో క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ఫైవ్ స్టార్ హోటల్లో నుండి దిగిన ఫోటో కాదు. అది నగరంలోని అత్యంత ధనవంతులు ఉండే ఏరియా ఉన్నట్లు తెలుస్తుంది.. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నేటిజన్స్ ముంబైలో సమంత కొత్త ఇల్లును కొనుగోలు చేసి ఆ ఇల్లు బాల్కనీ నుండే ఫోటో తీసింది కావచ్చు అని భావిస్తున్నారు..ఆ ఇల్లు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.. సమంత కు అది తక్కువే.. షూటింగ్ లేనప్పుడు అక్కడ ఉంటుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here