Samantha : కండలు చూపిస్తూ మతిపోగొడుతున్న సమంత లేటెస్ట్ హాట్ ఫోటోలు

- Advertisement -

Samantha : సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా సుమారుగా దశాబ్ద కాలం నుండి కొనసాగుతూ ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ సమంత.ఈమెకి ఒక స్టార్ హీరో తో సమానమైన క్రేజ్ ఉందని అనడంలో ఎలాంటి అతిశయం లేదు.అందం తో అద్భుతమైన అభినయం తో విలక్షణ నటిగా సమంత కి మంచి పేరుంది.చాలామంది ఈమెని నేటి తరం సావిత్రి అని పోల్చారు కూడా.

Samantha
Samantha

అయితే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కి ‘మయోసిటిస్’ అనే వ్యాధి సోకింది, డిప్రెషన్ నుండి కోలుకునేందుకు మితిమీరిన వర్కౌట్స్ చెయ్యడం వల్లే ఇలాంటి వ్యాధులు సోకుతాయని డాక్టర్లు చెప్పారు..సమంత డిప్రెషన్ నుండి కోలుకోవడం కోసమే అలా వర్కౌట్స్ చేసిందని తెలిసింది,గత కొంత కాలం నుండి ఈ ప్రాణాంతక వ్యాధి కోసం చికిత్స చేయించుకుంటున్న సమంత ఇప్పుడు కోలుకుంది.

వెంటనే పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ మొత్తానికి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని తన నిర్మాతలకు చెప్పింది, అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొనింది సమంత, త్వరలోనే విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొనబోతుంది.ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో జనవరి నెలలో తాను చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఫోటోలను అప్లోడ్ చేసింది.స్టోరీ డిస్కషన్స్ లో కూర్చోవడం , బాగా రెస్ట్ తీసుకోవడం, షూటింగ్ లో పాల్గొనడం , జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడం వంటి వాటికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసింది.

- Advertisement -
Samantha
Samantha

అందులో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన జిమ్ ట్రైనర్ తో దిగిన ఫోటో బాగా వైరల్ అయ్యింది, కండలు చూపిస్తూ ఫోటో కి ఫోజు ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ సమంత కి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి మితిమీరిన వర్కౌట్స్ చెయ్యడం వల్లే వచ్చిందని చెప్తూ ఉంటారు,ఇప్పుడు కాస్త ఆరోగ్యం కోలుకునేలోపు మళ్ళీ సమంత వర్కౌట్స్ చెయ్యడం చూసి అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు, కాస్త జాగ్రత్త గా కేర్ తీసుకొని వర్కౌట్స్ చెయ్యండి అంటూ ఆమెకి జాగ్రత్తలు చెప్తున్నారు అభిమానులు., మరికొంత మంది అయితే ఈ ఫోజులో చాలా హాట్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ పెట్టారు, ఆ ఫోటో ని మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here