Celebrity Wives : ఆ స్టార్ హీరోల భార్య‌ల సంపాద‌న‌.. భ‌ర్త‌ల కంటే కూడా ఎక్కువే..! గ్రేట్ రా బాబు!!Celebrity Wives : మన తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆ విషయంలో ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో పోల్చి చూస్తే గొప్ప స్థానాలలో ఉన్నారు. భారీ రెమ్యూనరేషన్ తో పాటు మంచి సక్సెస్తో దూసుకు పోతున్నారు..అయితే కొంతమంది హీరోల కంటే ఆ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తుండటం గమనార్హం. సినిమాలకు దూరంగా ఉన్నా తమ టాలెంట్ తో ఈ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు.. ఏ హీరోల భార్యలు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

Celebrity Wives
Celebrity Wives

న్యాచురల్ నాని భార్య అంజన కాస్టింగ్ డిజైనర్ గా పని చేస్తూ ప్రతి నెలా ఊహించని మొత్తాన్ని సంపాదిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆస్పత్రులకు సంబంధించి విధులు నిర్వహిస్తుండగా ఈమె సంపాదన కళ్లు చెదిరే రేంజ్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.

అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తుండగా ఈమె ఆదాయం కూడా ఊహించని స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.బన్నీ భార్య స్నేహారెడ్డి చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. స్నేహారెడ్డి పలు మ్యాగజైన్లకు ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Radhika Pandit Amal Sufiya

రాజీవ్ కనకాల భార్య సుమ సంపాదన కూడా ఊహించని స్థాయిలో ఉంది. సుమ టీవీ షోల ద్వారా, సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఊహించని స్థాయిలో సంపాదిస్తున్నారు.

రాజశేఖర్ భార్య జీవిత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. నందు భార్య గీతామాధురి సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారని సమాచారం. మహేష్ భార్య నమ్రత వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదిస్తున్నారని సమాచారం. ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోలస్తే వాళ్ళ భార్యలు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఈ విషయం గురించి ఎన్నో కథనాలు కూడా వస్తున్నాయి.. వీళ్ళే కాదు చాలా మంది స్టార్ హీరోల భార్యలు అలా పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు..