Salaar Trailer యాడ్స్ కోసం కోట్ల రూపాయిల ఖర్చు.. పాపం ఎంత కష్టమొచ్చింది!

- Advertisement -

Salaar Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.

Salaar Trailer
Salaar Trailer

కేజీఎఫ్ సిరీస్ లాంటి బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం వల్లే ఈ చిత్రానికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కావాల్సిన ఈ సినిమా, డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ నిన్న సాయంత్రం విడుదల చేసారు.

Salaar

ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంటుంది అని ఆశించిన ఫ్యాన్స్ కి తీవ్రమైన నిరాశే మిగిలింది. ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవడం, అందులోనూ ప్రభాస్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండడం అభిమానులకు మింగుడు పడలేదు. పైగా ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఉగ్రం సినిమాకి రీమేక్ గా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే సలార్ టీజర్ కి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ లో పావు శాతం కూడా ట్రైలర్ కి రాలేదనే చెప్పాలి.

- Advertisement -
Prashanth neel Prabhas

అందులోనూ ట్రైలర్ కి యాడ్స్ వేయించడం కోసం భారీగా ఖర్చు చేశారట. ఇప్పుడు యూట్యూబ్ లో ఏ వీడియో ఓపెన్ చేసిన మధ్యలో సలార్ మూవీ ట్రైలర్ ప్లే అవుతూ ఉంది. ఇందుకోసం దాదాపుగా కోటి రూపాయిల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. అంత చేసినా కూడా కేవలం 38 నుండి 42 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here