సలార్ టీజర్ రిలీజ్ రెడీ?.. ఫ్యాన్స్ కు జాతరే..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు భారీ కలెక్షన్ల వర్షం తో దూసుకుపోతుంది.. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబాట్టింది..ఇప్పుడు సలార్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది..ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. టీజర్ రెడీ అంటూ ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..

సలార్
సలార్

బాహుబలి’, ‘సాహో’ తర్వాత ఆ రేంజ్ కిక్కేచ్చి సినిమా థియేటర్ లోకి రాలేదు. చివరిగా వచ్చిన ‘రాధే శ్యామ్’; ‘ఆదిపురుష్’ ఆశించిన మేర అలరించలేకపోయాయని పలు రిపోర్ట్ ల ద్వారా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. డార్లింగ్ అభిమానులు నెక్ట్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం సలార్ . మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ ల్లో ఇదొక్కటి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు..దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో ‘సలార్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఊరమాస్ లుక్ లో, హైవోల్టేజీ యాక్షన్ తో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది.

prabhas

మిగిలిన కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారు..సలార్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఆ మధ్యలో టైటిల్ లో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్, తర్వాత రీలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అప్డేట్ అందించారు. ఇక నెక్ట్స్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రోజు రాబోతోంది. ‘సలార్’ నుంచి జూలై 7న పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఈ మేరకు మేకర్స్ ప్లాన్ చేశారంట..ఈ టీజర్ నిడివి 90 సెకండ్లు అంటే నిమిషన్నర ఉంటుందని తెలుస్తోంది. టీజర్ బీభత్సంగా ఉంటుందని, ప్రభాస్ లుక్, యాక్షన్, డైలాగ్స్ కు గూస్ బంప్స్ ఖాయమంటున్నారు.. ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తోంది..సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here