Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మామూలివి కావు. కానీ ఆ అంచనాలను ఏ మాత్రం కూడా అందుకోలేకపోయింది మొన్న విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్.

అసలు ప్రశాంత్ నీల్ యేనా ఈ సినిమాకి దర్శకత్వం వహించింది?, కేజీఎఫ్ లో ఏ రేంజ్ ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి, ఇందులో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి అనేది పోల్చి చూడడం ప్రారంభించారు. అంతే కాదు ఈ సినిమా ప్రభాస్ స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ సేపు ఉంటుందని సమాచారం. రీసెంట్ గానే మొదటి కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో వేసి మూవీ యూనిట్ తో పాటుగా పలు జిల్లాలకు సంబంధించిన బయ్యర్స్ ఈ చూపించారు.

అక్కడి నుండి లీక్ అయినా టాక్ ఇది. ఇందులో ప్రభాస్ ఎంట్రీ ఇంటర్వెల్ సన్నివేశం కి 30 నిమిషాల ముందు ఉంటుందట. అప్పటికే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఏమిటి ఈ సినిమా ఇలా వెళ్తుంది అనే అభిప్రాయం కలుగుతుందట. అందుకే అభిమానులను మితిమీరిన అంచనాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు చెప్పుకొచ్చారు.

ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా బాగుంటుందని, కానీ స్టోరీ రొటీన్ గానే అనిపిస్తుందని, ప్రభాస్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని చెప్తున్నారు. తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఇవన్నీ ఫ్యాన్స్ కి నచ్చుతాయి, లేకపోతే మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రెండవ ట్రైలర్ కూడా అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ ఎలాంటి రికార్డ్స్ పెట్టబోతోంది అనేది.