Salaar Movie : వెన్నులో వణుకుపుట్టిస్తున్న ‘సలార్’ కాటేరమ్మ దేవత స్టోరీ.. పూర్తి స్టోరీ చూస్తే హడలిపోతారు!

- Advertisement -

Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత విజయవంతమైన ఏకైక ప్రభాస్ సినిమా ఇదే. మధ్యలో వచ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ, వందల కోట్ల రూపాయిల నష్టాలను తెచ్చిపెట్టింది.

Salaar Movie
Salaar Movie

ప్రభాస్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకునేవాళ్ళో, అలా ఈ చిత్రం లో చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడుకుంటూ రాసిన ఎలివేషన్ సన్నివేశాలకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, యాక్షన్ మూవీ లవర్స్ కి కూడా పూనకాలు రప్పించింది. అలాంటి యాక్షన్ బ్లాక్స్ లో ఒకటి ‘కాటేరమ్మ’ ఫైట్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశం సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.

Salaar Movie Kateramma Story

అసలు ఎవరు ఈ కాటేరమ్మా, అసలు ఆమె చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కైలాసం లో పరమ శివుడు విశ్రమిస్తున్న సమయం లో పార్వతి దేవి ఆయనకి తెలియకుండా ఒక చోటు వెళ్లి వస్తుండేది అట. ఒకరోజు ఇది గమనించిన పరమశివుడు పార్వతి దేవిని నిలదియ్యగా, నేనెక్కడికి వెళ్లడం లేదు అని పార్వతి సమాధానం చెప్పిందట. అయితే ఒకరోజు శివుడు పార్వతి అలా వెళ్తున్నప్పుడు ఆమెకి తెలియకుండా రహస్యంగా ఆమెని అనుసరించాడట.

- Advertisement -
 Kateramma Story

దట్టమైన అడవుల మధ్యలో ఆమె నడుచుకుంటూ వెళ్లడం అని శివుడికి అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదట. అలా నడుచుకుంటూ పార్వతి దేవి పాతిపెట్టిన సేవలను తీసి తినడం ని గమనించాడట. ఆమెని ఆపేందుకు శివుడు ఉగ్రరూపం దాల్చి ఒక గొయ్య తవ్వి అందులో పార్వతిని పడిపోయేలా చేసాడట. దాంతో మైకం దిగిన పార్వతి దేవి జరిగిన విషయాలను తెలుసుకొని పశ్చాత్తాపం పడి శివుడి తో కలిసి కైలాసం కి వెళ్లిందట. ఆ క్రమం లో ఆమె విడిచిన రూపమే కాటేరమ్మ విశ్వరూపం అని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here