Bigg Boss Sohel : మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధేయపడుతూ ఏడ్చేసిన బిగ్ బాస్ సోహైల్.. అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Bigg Boss Sohel : బిగ్ బాస్ రేయాలిటీ షో ద్వారా వచ్చే ఫేమ్ ని తెలివైన కంటెస్టెంట్స్ ఎవరైనా సరైన పద్దతిలో వాడుకుంటారు. బిగ్ బాస్ లో క్రేజ్ వచ్చేసింది కదా , ఇక మనం సినిమాలో హీరో గా/ హీరోయిన్ గా వేరే లెవెల్ కి వెళ్ళిపోతాము అనుకుంటే పొరపాటే. వచ్చిన ఫేమ్ ని ఉన్న రంగం లోనే ఎలా పైకి ఎదగాలి అనేదానిపై ఫోకస్ పెట్టాలి.

Bigg Boss Sohel

అలా బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ సినిమాల్లోకి వెళ్లి హీరోలుగా సక్సెస్ అయిపోదామని చూసిన వారిలో ఒకడు సోహైల్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఇతను అరడజను సినిమాలకు పైగా హీరో గా చేసాడు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కనీసం ప్రేక్షకులకు విడుదలైనట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ చిత్రం లో హీరో గా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు సోహెల్. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ ‘మా నాన్న రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు, నేను ఇల్లు కట్టడం కోసం దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని ఈ చిత్రం కోసం ఖర్చు చేశాను. సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని కొరికి ఉన్నప్పుడు మా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మా అమ్మా నాన్న నన్ను సినిమాలకు వెళ్తాను అంటే ప్రోత్సహించారు.

- Advertisement -

కానీ నేను ఇప్పటి వరకు సక్సెస్ ని చూడలేదు. డిప్రెషన్ లోకి వెళ్లి ప్రాణాలను తీసుకునే ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ నిలబడి పోరాడాలని నిర్ణయించుకొని ఈ సినిమా తీసాను. దయచేసి నా సినిమాని థియేటర్స్ లోకి వచ్చి చూడండి’ అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధేయపడుతూ ఎమోషనల్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here