Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ ఎల్లుండి భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ప్రభాస్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని అనుకున్నారు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు ఎంతలా ఎదురు చూసారో నిన్న సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినప్పుడు అర్థం అయ్యింది.
అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించడానికి కాస్త సమయం పడుతుందేమో తెలీదు కానీ, ప్రతీ థియేటర్ లో బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంత ఆతృతగా ఎదురు చూసారు అనేది.
బుక్ మై షో యాప్ లోకి వెళ్లి చూస్తే అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ పెట్రోల్ మీటర్ కంటే వేగంగా ఉంది. మొదట్లో నిమిషానికి వెయ్యి టిక్కెట్ల రేంజ్ స్పీడ్ లో అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆ వేగం పెరిగి గంటకి 80 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. థియేటర్స్ పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించలేదు. అయ్యినప్పటికీ కూడా ఈ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఈ సినిమాకి మొదటి రోజు ఎలాంటి రికార్డ్స్ వస్తాయో ఊహించొచ్చు.
తెలంగాణ లో సలార్ చిత్రం #RRR మొదటి రోజు రికార్డు ని బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అర్థ రాత్రి 1 గంట నుండే షోస్ ప్రారంభించబోతున్నారు. మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే విధంగా ఉంది. మళ్ళీ ఈ రికార్డు ని ఎవరు కొట్టబోతున్నారో చూడాలి.