Guntur Kaaram : ఇదెక్కడి గోల మళ్లీ లీకైన మహేష్ సినిమా సీన్.. గుంటూరు కారం సినిమా మొత్తం లీక్ చేసేలా ఉన్నారుగా..

- Advertisement -

Guntur Kaaram : మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు.. లీకుల బెడద మాత్రం పోవడం లేదు.

Guntur Kaaram
Guntur Kaaram

కొన్నిసార్లు ఆడియో సాంగ్స్ లీక్ అవుతుంటే.. ఇంకొన్నిసార్లు షూటింగ్ వీడియోస్ లీక్ అయ్యాయి. ధం మసాలా బిర్యానీ ఆడియో లీక్ అయ్యింది.. ఆ తరువాత వెంటనే మేకర్స్ అధికారికంగా ఆ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఒక మాస్ సాంగ్ షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించగా.. మహేష్ ఫ్యాన్సీ లుక్ లో అదరగొట్టాడు.

Sreeleela

ఈ సాంగ్ కాస్ట్యూమ్స్ బట్టి ఇది మాస్ సాంగ్ లా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లీకెడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ లీక్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. రేయ్.. రేయ్.. సినిమా మొత్తం లీక్ చేసి పడేస్తున్నారు కదరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సినిమాపై ఇంట్రెస్ట్ లేకుండా పోతుందని చెప్పుకొస్తున్నారు. అయినా కూడా కొందరు వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటి వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. మేకర్స్ .. ఇకనుంచి అయినా ఇలాంటి లీక్స్ అవ్వకుండా చూసుకుంటే బావుంటుందని చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here