Salaar : ‘వరల్డ్ కప్ మ్యాచ్’ లో ‘సలార్’ ఫీవర్..ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కి జోహార్లు!

- Advertisement -

Salaar : టాలీవుడ్ నుండి తెరకెక్కే పాన్ ఇండియన్ మూవీస్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది.

Salaar
Salaar

సినిమా వాయిదా పడినప్పటికీ కూడా మార్కెట్ లో ఈ చిత్రంపై ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం తో సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేశం తో ఊగిపోయారు. నిన్న ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘హోమబుల్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో నెగటివ్ ట్రెండ్ చేసారు.

రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఫ్రస్ట్రేషన్ తార స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ మరోసారి ఈ సినిమాని వాయిదా వేస్తారో అనే భయం వారిని వెంటాడుతుంది. అలాంటి అభిమానుల కోసం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్ లో చివరి మ్యాచ్ ఇండియా నెథర్ ల్యాండ్ టీం తో తలపడనుంది. ఈ మ్యాచ్ కి ఏకంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ విచేయబోతున్నాడట.

- Advertisement -

ఇక్కడి నుండే మూవీ టీం గ్రాండ్ గా ప్రొమోషన్స్ ని ప్రారంభించబోతుందని, డిసెంబర్ 22 వరకు నాన్ స్టాప్ గా ఈ ప్రొమోషన్స్ జరగనున్నాయని అంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రపంచ కప్ ని గెలుచుకోవడానికి అడుగు దూరం లో ఇండియన్ టీం పై ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ప్రత్యేకమైన ద్రుష్టి ఉంది. ఇలాంటి సమయం లో సలార్ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటే ప్రపంచం లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలుస్తుందని మూవీ టీం ఇలా ప్లాన్ చేసిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here