Saiyami Kher : కొంతమంది హీరోయిన్స్ అందం మరియు నటన రెండు కలిగి ఉన్నా కూడా ఎందుకో కేవలం ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమై, అవకాశాలు వచ్చినా మన టాలీవుడ్ లో చెయ్యడానికి ఇష్టపడరు. ఉదాహరణకి సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటి సినిమా ‘రేయ్’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ‘సైయామి ఖేర్’ ని తీసుకుందాము.ఈ చిత్రం ఈమెకి మొదటి సినిమా, పోస్టర్స్ మరియు టీజర్స్ లో ఈమె లుక్స్ ని చూసి అప్పట్లో కుర్రాళ్ళు మెంటలెక్కిపొయ్యేవాళ్ళు.

అప్పట్లో YVS చౌదరి సినిమా ద్వారా పరిచయమయ్యే హీరోయిన్ కచ్చితంగా టాప్ స్థానానికి చేరుకుంటుంది అనే నమ్మకం ఉండేది.ఎందుకంటే అప్పట్లో ఆయన తీసిన ‘దేవదాసు’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో అందులో హీరోయిన్ గా చేసిన ఇలియానా రేంజ్ రాత్రికి రాత్రే మారిపోయింది.ఆ సినిమా తర్వాత ఆమె ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.అవి సూపర్ హిట్స్ అవ్వడం తో ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

సైయామి ఖేర్ లో కూడా ఇలియానా లో ఉన్న స్పార్క్ ఉండడంతో ఈమె కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది అని అందరూ అనుకున్నారు.కానీ ‘రేయ్’ సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.వాస్తవానికి ఈ సినిమానే సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాగా విడుదల అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ముందుగా విడుదల అయ్యింది.ఇది కాసేపు పక్కన పెడితే , ‘రేయ్’ చిత్రం ఫ్లాప్ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ ఆమె చెయ్యలేదు.

అదే సమయం లో బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయి.’మిర్జియా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు,ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ ఫలితం మాత్రం సూన్యం.మళ్ళీ తెలుగు లో అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘ వైల్డ్ డాగ్ ‘ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, కరోనా పీక్ సమయం లో విడుదల కావడం వల్ల ఈ చిత్రం కూడా కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు హిందీ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీటితో అయినా ఆమె సక్సెస్ అందుకుంటుందని ఆశిద్దాం.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.ఆమె ఆ ఫోటోలలో ఎంత హాట్ గా ఉందో మీరే చూడండి.