Sai Pallavi : పుష్పరాజ్​తో జతకట్టనున్న రౌడీ బేబీ.. క్రేజీ కాంబో తెరపైకి వచ్చేనా..?

- Advertisement -

Sai Pallavi : సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని న్యూస్ సడెన్​గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ.. అది నిజమైతే ఎంత బాగుంటుందోనని అందరూ అనుకునేలా ఉంటాయి అలాంటి న్యూస్. ప్రస్తుతం ఇలాంటి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఓ రేంజ్​లో షేక్ చేస్తోంది. అదేంటంటే.. పుష్ప-2 సినిమాలో ఓ కీలక పాత్రలో నేచురల్ బ్యూటీ అదేనండి మన రౌడీ బేబీ సాయి పల్లవి నటిస్తోందని. ఈ న్యూస్ ఇవాళ పొద్దున్నుంచి సామాజిక మాధ్యమాల్లో, డిజిటల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.

Sai Pallavi
Saipallavi and allu arjuna

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్‌స్టార్​గా మారాడు. ఏ ముహూర్తాన ఐకాన్ స్టార్ అయ్యాడో కానీ.. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ మనవైపు చూస్తోందంటే.. తెలుగు కథలపై మనసు పడుతోందంటే బాహుబలి తర్వాత అత్యంత బలమైన కారణం పుష్ప సినిమా. పుష్ప క్రేజ్, పుష్పరాజ్ మేనియా నార్త్ సినిమా ఇండస్ట్రీని మామూలూగా షేక్ చేయలేదు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్​తోనే డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 2 తీసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే పుష్ప2లో చాలా కీలక పాత్రలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పాత్రల గురించి చిత్రబృందం అప్డేట్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా పుష్ప 2 గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.

‘పుష్ప 2’ లో పుష్పరాజ్​తో నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి నటించనున్నారని సమాచారం. ఇందులో ఓ పాత్ర కోసం సుకుమార్‌ టీమ్‌ ఆమెను సంప్రదించిందని, రోల్‌ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని, షూట్‌ కోసం పది రోజులపాటు డేట్స్‌ ఇచ్చిందని నెట్టింట ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలపై అటు బన్నీ అభిమానులు, ఇటు సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సాయిపల్లవి నిజంగానే ఈసినిమాలో నటిస్తున్నారా? అనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -
sai pallavi

అయితే ఈ క్రేజీ కాంబో కోసం మాత్రం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇది పుకారు కాకూడదని.. నిజం కావాలని కోరుకుంటున్నారు. ఓవైపు డ్యాన్స్​ను ఈజ్​గా చేసే.. సూపర్ స్వాగ్ ఉండే అల్లు అర్జున్.. మరోవైపు డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి.. నటనలోనూ ఇద్దరు ఎవరికి ఎవరూ తీసిపోరు. ఇక ఈ కాంబో కనుక తెరపైకి వస్తే అభిమానులకు పూనకాలే. ఈ సినిమాలో పాత్ర కాకపోయినా.. బన్నీతో సాయి పల్లవి ఓ డ్యాన్స్​లోనైనా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ సాయి పల్లవి స్పెషల్ సాంగ్స్​కు ఎప్పుడో నో చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు తన పాత్ర స్ట్రాంగ్​గా ఉంటే తప్ప సాయి పల్లవి ఓకే చెప్పదు. సో.. తను ఓకే చెప్పిందంటే పుష్ప 2లో ఓ సూపర్ పవర్ ఫుల్ పాత్ర ఉండబోతోందని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘పుష్ప ది రైజ్‌’. అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఇది. రష్మిక కథానాయిక. 2021లో విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సాయిపల్లవి విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన ‘విరాటపర్వం’, ‘గార్గి’తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. వీటి తర్వాత ఆమె నుంచి కొత్త సినిమా అప్‌డేట్‌ ఏమీ రాలేదు. ప్రస్తుతం నెట్టింట మాత్రం ఈ పుకారు జోరందుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com