తెలుగు, మలయాళ, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాయిపల్లవి (Sai Pallavi). శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ భామ. భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. చివరగా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. తర్వాత గార్గి తో అలరించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేకపోయినా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

విరాటపర్వంలో రవన్న తల్లి రాసిన ఉత్తరాన్ని అతన్ని కలిసి అందించేందుకు వెన్నెల చాలా రిస్క్ చేస్తుంది. అయితే నిజజీవితంలో లవ్ లెటర్ (love letter) రాసిందట ఈ అమ్మడు. చిన్ననాటి సంఘటనను ఒకటి షేర్ చేసుకుంది.. మథర్స్ డే సందర్భంగా గుర్తు చేసుకుంది. సాయిపల్లవి స్కూల్ స్టేజ్‌లో ఓ అబ్బాయికి రాసిన లవ్ లెటర్ ఆమె తల్లిదండ్రుల కంట పడిందట. నా చిన్న తనంలో ఓ అబ్బాయికి లేఖ రాసిందట. అపుడు నేను ఏడో తరగతి చదువుతుందట. ఈ విషయం తెలిసి అమ్మానాన్న నన్ను చాలా బాగా కొట్టారట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు సాయి పల్లవి ఏం చెప్పిందంటే.. ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్‌లో ఒక అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఈతడితో ప్రేమలో పడ్డాను. ఆ విషయం చెప్పాలని ఒకరోజు ప్రేమలేఖ రాశా. కానీ, అది అతనికి ఎలా ఇవ్వాలో తెలియక పుస్తకంలో దాచిపెట్టాను. అనుకోకుండా ఆ లెటర్ మా అమ్మ కంట పడింది. దాంతో చెప్పలేనంత కోపం వచ్చి నన్ను చితక్కొట్టేసింది. అమ్మ కొట్టడం అదే మొదలూ, చివరా. ఇప్పటి వరకూ మళ్లీ తనకి కోపం తెప్పించే పనులు చేయలేదు. అని చెప్పింది.