Ruhani Sharma మరీ ఇంతగానా.. ఇంత బోల్డ్ సీన్స్ లో నటించిందా..!

- Advertisement -

Ruhani Sharma : ప్ర‌ముఖ‌ న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ మొద‌టి సారి మెగాఫోన్ చేత బ‌ట్టి రూపొందించిన చిత్రం చి ల సౌ. విమ‌ర్శ‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అక్కినేని వార‌సుడు సుశాంత్ హీరోగా న‌టించ‌గా నార్త్ బ్యూటీ రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా తెలుగునాట ఆరంగేట్రం చేయ‌డంతో పాటు చిత్రంలో న‌ట‌న‌కు గాను అధిక మార్కులు సైతం కొట్టేసింది. తెలుగు నాట కాస్త అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. ఆ త‌ర్వాత రుహానీ శ‌ర్మ క‌థానాయిక‌గా హిట్‌, హ‌ర్‌, నూటొక్క జిల్లాల అంద‌గాడు వంటి సినిమాల‌తో పాటు సైడ్ క్యారెక్ట‌ర్స్‌లో డ‌ర్టీ హ‌రి, మీట్ క్యూట్‌, సైంథ‌వ్‌, ఆప‌రేష‌న్ వాలంటైన్‌ తాజాగా శ్రీరంగ‌నీతులు వంటి సినిమాలు చేసి మెప్పించింది.

Ruhani Sharma
Ruhani Sharma

అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌ని ఈ బ్యూటీ ఇప్ప‌డికే ఒక‌టి రెండు హిందీ సీరీస్‌ల‌లో ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించి ఔరా అనిపించినా తెలుగులో ఆ స్థాయి గ్లామ‌ర్ సినిమాలు ప‌డ‌లేదు, చేయ‌లేదు. అడ‌పాద‌డ‌పా హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు మ‌తులు పొగొడుతోంది. అయితే రుహానీ శ‌ర్మ 2019లో న‌టించిన ఓ బాలీవుడ్ సినిమా ఆగ్రా అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఇప్పుడు థిమేట‌ర్లలో విడుద‌ల‌య్యేందుకు రెడీ అయింది. గ‌త సంవ‌త్స‌రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల‌లో ప్ర‌ద‌ర్శించ‌గా మంచి అప్లాజ్ తెచ్చుకుంది.

- Advertisement -

దీంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. ఈక్ర‌మంలో ఏప్రిల్ 3న ఫ్రాన్స్‌లో సినిమాను విడుద‌ల చేసిన క్ర‌మంలో చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా అందులో రుహానీ శ‌ర్మ ముద్దు సీన్లు, ఇంటిమేట్‌ సీన్ల‌ను చూసి ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. అస‌లు అందులో న‌టించింది రుహానీ శ‌ర్మేనా మ‌రి ఇంత ప‌చ్చిగా బోల్డ్‌ సీన్ల‌లో న‌టించిందేంటంటూ నోరెళ్ల బెడుతున్నారు. చాలామంది నెటిజ‌న్లు రుహ‌నీ శ‌ర్మ‌కు ఎందుకీ ఖ‌ర్మ‌.. అలాంటి స‌న్నివేశాల‌లో న‌టిచాల్సిన అవ‌స‌ర‌మేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందం ఉంది, అభిన‌మయం ఉంది , పైగా తెలుగులో ఛాన్సులు మంచిగానే వ‌స్తున్నాయ్ క‌దా శృతి మించి మ‌రీ అలాంటి శృంగార స‌న్నివేశాలలో చేయాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చిందంటూ ఆమె అభిమానులు ఫీల‌వుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here