Ruhani Sharma : సోఫాలో కూర్చొని రుహానీ క్యూట్ పోజులు.. మెస్మరైజ్ అవుతున్న నెటిజన్లు

- Advertisement -

Ruhani Sharma .. సుశాంత్ ‘చిలసౌ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రుహానీ నటనటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక తన బ్యూటీకి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. చిలసౌ తర్వాత రుహానీకి టాలీవుడ్​లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇందులో విశ్వక్ సేన్ సరసన ‘హిట్’ సినిమాలో నటించింది. ఆ మూవీ ఎంత భారీ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.

Ruhani Sharma
Ruhani Sharma

‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలతో పాటు ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ యాంథాలజీలోనూ రుహాని నటించి మెప్పించింది. ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘హర్’ (HER)లోనూ ఆమె నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహాని.. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మకు ఆ సినిమా డైరెక్టర్ శైలేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. తన లేటెస్ట్ సినిమా ‘సైంధవ్’లో అవకాశం కల్పించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.రేణుగా ఆమె నటిస్తున్నట్లు రుహాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Ruhani Sharma Photos

ఇక రుహానీ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్​లో ఉంటుంది. అయితే ఈ మధ్య రుహానీ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. థైస్ షో చేస్తూ.. ఎద అందాలు చూపిస్తూ.. మత్తు చూపులతో మాయ చేస్తున్న ఫొటోలను షేర్ చేసి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా ఈ భామ మరోసారి తన ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించింది. ఈసారి ట్రెండీ వేర్​లో రుహానీ సందడి చేసింది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్​లో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేసింది. స్టన్నింగ్ లుక్స్​తో ఇంటర్నెట్​ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Ruhani Sharma Stills

సోఫాలో కూర్చొని చేతిలో కాఫీ కప్పుతో రుహానీ క్యూట్ పోజులిచ్చింది. నాటీ చూపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. క్యూట్ స్మైల్​తో యువకులను మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు రుహానీ అందానికి ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ క్యూట్​నెస్​కు మెస్మరైజ్ అవుతున్నారు. హార్ట్ ఎమోజీస్ షేర్ చేస్తూ ఈ భామపై తమ ప్రేమను కురిపిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here