RRR సైకిల్ రైడ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీం.. నెటిజన్స్ కి నేత్రపర్వం..

- Advertisement -

RRR దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావచ్చునా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు.. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి చలనమే.. పాట, టీజర్ ప్రతి ఒక్కటి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి.. ప్రతి తెలుగోడు కాలర్ ఎగిరేసేలా ఆస్కార్ అవార్డులు కూడా ఈ చిత్రంలోని నాటు నాటు సొంతం చేసుకోవడం మరో హైలెట్.. తాజాగా ఈ చిత్ర టీమ్ రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

RRR
RRR

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కైవసం చేసుకుంది. ఈ సక్సెస్ ని గుర్తు చేసుకుంటూ ఈ చిత్ర యూనిట్ స్పెషల్ సోషల్ మీడియా పోస్ట్లు చేశారు. ఈ చిత్రం గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డుల వివరాలు తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కి సంబంధించి సోషల్ మీడియాలో ఈ చిన్న పోస్ట్ చేసిన అది సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది..

ఆర్ఆర్ఆర్ సినిమా సెక్స్ పై ఉన్నప్పుడు తీసుకున్న ఒక అన్ సీన్ పిక్ ఒకటి అభిమానులతో పంచుకున్నారు టీమ్.. ఈ ఫోటోలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సైకిల్ రైడ్ చేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో.. తారక్ కొమరం భీమ్ గెటప్ లో ఉండగా రాజమౌళి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ స్టైల్ గా ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

- Advertisement -

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ టీం తమ అధికారిగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ఆలియా భట్, ఓలీవియామోరీస్ హీరోయిన్స్ గా నటించారు‌ అజయ్ దేవగన్ కీలక పాత్ర లో కనిపించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here