RRR Movie అయ్యినప్పటికీ కూడా వాళ్ళని ఆ రేంజ్ థ్రిల్ కి గురి చేసాడంటే అది కచ్చితంగా రాజమౌళి మ్యాజిక్ అనే చెప్పాలి.రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డుని గెలుచుకున్న ఈ సినిమా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి గాను ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యింది.ఆస్కార్ అవార్డు వస్తుందో లేదో తెలియదు కానీ, ఒక తెలుగు సినిమా ఒస్కార్స్ కి నామినేట్ అవ్వడం ఇదే తొలిసారిగా చరిత్రలో మిగిలిపోతాది ఈ చిత్రం.
గత ఏడాది అన్ని ప్రాంతీయ బాషలలో విడుదలై సంచలనం సృష్టించిన #RRR చిత్రం ఓటీటీ లో విడుదలైన తర్వాత పాన్ ఇండియన్ సినిమా రేంజ్ నుండి పాన్ వరల్డ్ రేంజ్ కి రీచ్ అయ్యింది.పశ్చిమ దేశాలలో ఈ సినిమాని ఆడియన్స్ ఎగబడి మరీ చూసారు.హాలీవుడ్ లో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అక్కడున్న పెద్ద పెద్ద టెక్నిషియన్స్ ని సైతం మంత్రముగ్దులను చేసింది ఈ చిత్రం.వాళ్లకి ఇలాంటి సినిమాలు చూడడం కొత్తేమి కాదు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ఇంగ్లీష్ లో దబ్ చేసి ఆ ఆడియో ని నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడో అప్లోడ్ చేసారు.కానీ ఇప్పుడు ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ థియేటర్స్ లో సందడి చేయనుంది.సుమారుగా 200 కి పైగా అమెరికన్ థియేటర్స్ లో ఈ సినిమా వచ్చే నెల మూడవ తారీఖున సందడి చేయనుంది.మరి ఆడియన్స్ ఈ చిత్రానికి ఏ రేంజ్ లో బ్రహ్మారథం పడుతారో చూడాలి.రీసెంట్ గా రీ రిలీజ్ అయినా జేమ్స్ కెమరూన్ టైటానిక్ చిత్రం ఇక్కడ అద్భుతాలను సృష్టించింది.
#RRR ఇంగ్లీష్ వెర్షన్ కూడా అదే రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.ఇక వచ్చే నెల 12 వ తారీఖున జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి #RRR మూవీ టీం మొత్తం హాజరు కాబోతుంది.ఈ వేదిక పై జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నాటు నాటు పాటకి స్టెప్పులు వెయ్యనన్నారు. హాలీవుడ్ దిగ్గజాల మధ్యలో మన ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి కూర్చుంటారు అనే సంఘటన ఊహిస్తేనే ఎంతో గర్వంగా ఉంది,ఇక ఆరోజు ప్రత్యక్ష లైవ్ చూస్తే ఏ రేంజ్ గూస్ బంప్స్ వస్తాయో ఊహించుకోవచ్చు.