1 కాదు..2 కాదు.. ఏకంగా 22 హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసిన #RRR మూవీ.. జపాన్ లో సరికొత్త ప్రభంజనం!

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం#RRR మూవీ ఇప్పటికీ జపాన్ వంటి ప్రాంతాలలో గత 250 రోజుల నుండి విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. ఇండియన్ ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం సాధించిన విజయం కంటే జపాన్ లో సాధించిన విజయమే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాల రికార్డ్స్ ని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తూనే ఉంది ఈ చిత్రం.

#RRR మూవీ
#RRR మూవీ

అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటి వరకు 2.11 బిలియన్ డాలర్లు వసూలు చేసిందట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 130 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం అక్కడి జపనీస్ మూవీస్ రికార్డ్స్ తో పాటుగా, హాలీవుడ్ మూవీస్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతూ ముందుకెళ్తుందట.

అక్కడి ట్రేడ్ లెక్కల ప్రకారం ఇప్పటికి వరకు మార్వెల్ సంస్థ నుండి వచ్చిన 32 సినిమాలలో 22 సినిమాలను #RRR చిత్రం దాటిందని, ఇప్పటి వరకు జపాన్ సినిమాలు కూడా ఇలాంటి అరుదైన రికార్డుని నెలకొల్పలేకపోయిందని చెప్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం కెప్టెన్ మార్వెల్ రికార్డ్స్ ని బద్దలు కొట్టిందట.

- Advertisement -

అతి త్వరలోనే మరో మార్వెల్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ : మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ చిత్రం వసూళ్లను కూడా దాటేయబోతుందని తెలుస్తుంది. ఊపు చూస్తూ ఉంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి జపాన్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ స్థాయి లో ఒక ఇండియన్ సినిమా జపాన్ లో ప్రభంజనం సృష్టించడం అనేది భవిష్యత్తులో రాజమౌళి తో కూడా సాధ్యపడకపోవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here