Baby : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ నటించిన చిత్రం బేబీ (Baby 2023) సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో బేబి సక్సెస్ మీట్ ను రెండు తెలుగు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే వైష్ణవి చైతన్య ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.
“వైష్ణవి నా బాధ అంతా నీమీదే ఉండేది. ఈ సినిమా వల్ల నీ కెరీర్ ఎక్కడ పాడవుతుందో అని అదే ఆలోచన ఉండేది. ప్రతీక్షణం అదే ఆలోచించేవాన్ని. నెగెటివ్స్ వస్తుంటాయి. అవేం పట్టించుకోకు. లైట్ తీసుకో. ఒక ఇంపాక్ట్ ఉంటుంది. పడయప్ప (నరసింహా) సినిమా రిలీజైనప్పుడు రమ్యకృష్ణ కటౌట్ లు కాల్చేశారు. నీ క్యారెక్టర్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అంతా బాగా చేశావ్ నువ్వు” అని సాయి రాజేష్ తెలిపారు. “తను అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ అలా ఏడుస్తూనే ఉంది. అంటే ఇన్ఫినిటమ్ లో మంచిగా ఒక గౌరవప్రదమైన శాలరీ తీసుకుంటూ జూబ్లీ హిల్స్ లో హ్యాపీగా ఉండేది. సినిమా స్టార్ట్ చేసిన మూడేళ్లు రెండేళ్లలో అత్తాపూర్ కు షిఫ్ట్ అయిపోయింది.
అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్రమ్స్ ఫేస్ చేసింది తను. నాకు తెలుసు, కానీ నేను హెల్ప్ చేసే పరిస్థితిలో లేను. అంతా కోల్పోయింది ఈ సినిమా కోసం” అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. “చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది. నన్ను పొగిడుతుంటే నాకు ఏమనిపించట్లేదు. కానీ, మీ ముగ్గురు బాగా చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది” అని సాయి రాజేష్ పేర్కొన్నారు. అలా తనగురించి డైరెక్టర్ సాయి రాజేష్ చెబుతున్నప్పుడు వైష్ణవి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా వీళ్ల మధ్యలో ఏదో సాగుతుందంటూ గుసగుసలాడుకుంటున్నారు.