Baby : సినిమా యాక్టర్ల రెమ్యూనరేషన్లు తెలిస్తే షాక్ అవుతారు.. స్టార్స్ కు కూడా ఇంత ఉండదుగా..

- Advertisement -

Baby : ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బేబీ సినిమా సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. యూత్ అండ్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుడడంతో అడియన్స్ నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి ప్రేమకు మరణంలేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అంటూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది.

Baby
Baby

ముఖ్యంగా ఈ సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ సినిమాలో తన అమాయకమైన నటనతో మరోసారి మెప్పించాడు హీరో ఆనంద్ దేవరకొండ. ఇక యంగ్ హీరో విరాజ్ అశ్విన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొత్తానికి ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు.. ఈ ముగ్గురి నటన అద్భుతమనే చెప్పాలి. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్ దిశకు చేరుకుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారీగా కలెక్షన్స్ రాబడుతూ థియేటర్లలో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురి రెమ్యూనరేషన్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బేబీ సినిమాను దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‏తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రధాన బలం అయిన హీరోయిన్ వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అలాగే కీలకపాత్ర పోషించిన విరాజ్ అశ్విన్‏కు రూ.20 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here