Prabhas : డైనోసర్ ఆకలి తీరిందనకునే లోపే.. తుస్సుమనిపించిన డార్లింగ్ .. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

- Advertisement -


Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తెలిసి చేస్తున్నాడో లేక తెలియక చేస్తున్నాడో తెలియడం లేదు కానీ.. తెలిసి తెలియక తనంతో చేసే పనులు మాత్రం అభిమానులను బాగా హర్ట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన తాజా చిత్రం సలార్ మూవీ హిట్ అయిందని ఆనందపడాలో లేక ఈ లోపే ప్రభాస్ చేసిన పనికి బాధపడాలో తెలియని అయోమయం పరిస్థితిలో ఉన్నారు ఆయన అభిమానులు.

సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో తెలిసిందే. అయితే సలార్ సినిమా టీం విడుదలకు ముందు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. దీంతో సినిమా విడుదల అయిన తర్వాత అయినా సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా చాలా గ్రాండ్ గా చేస్తారని ఆశపడ్డారట ప్రభాస్ అభిమానులు. అయితే ఎవరికీ తెలియకుండా మూడో కంటికి కనిపించకుండా చిత్ర టీం సభ్యులు మీట్ అయి చిన్న పార్టీ చేసుకొని సెలబ్రేషన్స్ పార్ట్ ని క్లోజ్ చేశారట.

ప్రస్తుతం ఇదే వార్త డార్లింగ్ అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. ఏంటి డార్లింగ్ నువ్వు సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో చేసుకుంటావని అనుకున్నాం. కానీ నువ్వు ఇలా తుస్సుమనిపించావ్ అంటూ ఫీల్ అయిపోయి నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి బాహుబలి సక్సెస్ తర్వాత వచ్చిన వరుస ఫ్లాపుల కారణమో మరేమో తెలియదు కానీ సలార్ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ ముందు నుంచే సైలెంట్ గా ఉన్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పెద్ద హంగామా కూడా చేయలేదు. ఇద్దరు వారి వారి కష్టాన్ని నమ్ముకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here