Pawan Kalyan – Surya : పవన్ కళ్యాణ్ – సూర్య కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా అదేనా..!

- Advertisement -

Pawan Kalyan – Surya : టాలీవుడ్ లో అత్యధిక సూపర్ హిట్ సినిమాలను చేతులారా మిస్ చేసుకున్న హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ ని రఫ్ఫాడించిన సినిమాలను ఎన్నో ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల మిస్ అయ్యాడు. ఆ సినిమాలు కొంతమంది హీరోల జాతకాలనే మార్చేశాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కొన్ని క్రేజీ మల్టిస్టార్రర్ కాంబినేషన్ సినిమాలను కూడా మిస్ అయ్యాడని ఈమధ్యనే తెలిసిందే.

Pawan Kalyan - Surya
Pawan Kalyan – Surya

అందులో ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఉంది. అప్పట్లో ఈ చిత్రాన్ని తొలుత వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తీద్దాం అనుకున్నారు. చివరికి అది వెంకటేష్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కింది. అలాగే గతం లో ఆయన ప్రముఖ తమిళ హీరో సూర్య తో కలిసి ఒక మల్టిస్టార్రర్ చిత్రం చెయ్యాల్సి ఉందట.

ఈ చిత్రాన్ని లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాలని అనుకున్నాడు. 1920 నాటి పీరియడ్ డ్రామా కథతో ఈ సినిమాని తియ్యాలనుకున్నాడట డైరెక్టర్ మణిరత్నం. ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమాలో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా సెట్స్ మీదకి మాత్రం వెళ్లలేకపోయింది. మణిరత్నం లాంటి లెజెండ్ డేట్స్ అడగడం తో ఇరువురు హీరోలు మిగతా ప్రాజెక్ట్స్ ని కూడా పక్కన పెట్టి ఆయనకీ డేట్స్ ఇచ్చారట.

- Advertisement -

కానీ ఆ చిత్రానికి నిర్మాత కూడా మణిరత్నం అవ్వడం, అప్పటి స్టాండర్డ్స్ కి మించి భారీ బడ్జెట్ అవుతుండడం తో రిస్క్ చెయ్యలేక ఆపేసాడట. ఈ విషయం లో కాస్త ఇద్దరు హీరోలు కూడా నిరాశ చెందారట. అయితే ప్రస్తుతం సౌత్ మొత్తం మల్టీస్టార్రర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, కనీసం ఇప్పటికైనా ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here