సాయి పల్లవికి ఆ సమస్య ఉంది అందుకే ఇలా చేస్తోంది.. పాపం అంటున్న జనాలు

- Advertisement -

భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ. ;ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి.

సాయి పల్లవి
సాయి పల్లవి

కెరీర్ ఆరంభం నుంచి ఆమె మేకప్ కు దూరంగా ఉండానికి ఒక బలమైన కారణం ఉందట. సాయి పల్లవి పలు చర్మ సమస్యలతో బాధపడుతుందని టాక్ వుంది. మేకప్ ఉత్పతులను వాడితే ఆమె చర్మంపై ర్యాషెస్, తీవ్రమైన దురద వంటి సమస్యలు వస్తాయట. పైగా మొదటి నుంచి ఆమెకు అసలు మేకప్ వేసుకునే అలవాటు లేదట. తొలి చిత్రం ప్రేమమ్లోనూ మేకప్ వేసుకోకుండానే నటించింది. అయితే ఆ టైమ్ లో తన అందంపై సాయి పల్లవి ఎంతో టెన్షన్ పడింది. కానీ, ప్రేక్షకులు ఆమెను బాగా రిసీవ్ చేసుకున్నారు. దాంతో సాయి పల్లవి తనకు మేకప్ అవసరం లేదని అప్పుడే డిసైడ్ అయిందట.

అందాల సాయి పల్లవి
అందాల సాయి పల్లవి

సాయి పల్లవి చాలా స్పెషల్. అందాల ఆరబోతకు ఆమడదూరంగా వుంటుంది. అందుకే ఈమెకి తెలుగునాట చేలా ప్రత్యేకమైన పేరు ఉంటుంది. హీరోలకి మల్లె ఆమెకి ఇక్కడ అభిమాన సంఘాలు వున్నాయంటే మీరు నమ్ముతారా? ఆమె ఎక్కడ కనబడినా లేడీ పవర్ స్టార్ అంటూ ఆమెని పిలుస్తూ వుంటారు. అంతలా సాయి పల్లవి ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ చాలా పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com