‘హరి హర వీరమల్లు’ నుండి తప్పుకోనున్న డైరెక్టర్ క్రిష్..? ఆ హీరో తో కొత్త ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఎప్పుడో ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ సమయం లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. మధ్యలో కరోనా లాక్ డౌన్ ఈ చిత్రం ఆలస్యం అవ్వడానికి కారణం అయితే, పవన్ కళ్యాణ్ వేరే సినిమాల షూటింగ్స్ కి కమిట్ అయ్యి వాటికే ముందు ప్రాముఖ్యత ఇవ్వడం మరో కారణం.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

కరోనా లాక్ డౌన్ ఎత్తివేయగానే పవన్ కళ్యాణ్ డేట్స్ మొత్తాన్ని భీమ్లా నాయక్ సినిమా కోసం ఇచ్చేసాడు. ఈ సినిమా తర్వాత చాలా కాలం షూటింగ్స్ కి విరామం ఇచ్చి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.సుమారుగా రెండు నెలల పాటు విరామం లేకుండా ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కించారు.

హరి హర వీరమల్లు
హరి హర వీరమల్లు

ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది.ఈ గ్యాప్ లో ఆయన ‘బ్రో’ మూవీ షూటింగ్ లో పాల్గొని ఆ సినిమాని పూర్తి చేసాడు.ఆ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ ని ప్రారంభించి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసాడు, ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే #OG మూవీ షూటింగ్ కి డేట్స్ ఇచ్చేసాడు.సుమారుగా నెల రోజుల వరకు సాగిన ఈ షెడ్యూల్ తర్వాత ఇక మే నెల మొత్తాన్ని ‘హరి హర వీరమల్లు’ కి ఇస్తాడని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది.ఫ్యాన్స్ కూడా నిజమే అనుకున్నారు,కానీ ఈరోజు నుండి మళ్ళీ ఆయన హైదరాబాద్ లో కొత్తగా జరుగుతున్న షెడ్యూల్ కి డేట్స్ ఇచ్చేసాడు, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ కేటాయించబోతున్నాడట.

- Advertisement -

ఇదంతా గమనించిన డైరెక్టర్ క్రిష్ తీవ్రమైన అసహనం కి గురై వేరే ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట.బాలీవుడ్ లో ఒక క్రేజీ స్టార్ హీరోతో రీసెంట్ గా చర్చలు కూడా పూర్తి అయ్యినట్టు సమాచారం.మరి క్లైమాక్స్ భాగం తప్ప షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసి వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా, లేదా ముందుగానే ఆ ప్రాజెక్ట్ కి వెళ్లిపోనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెల లో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోతే ఇక వేరే సినిమాకే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట క్రిష్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here