Director Rajamouli : ఏంటి జక్కన్న..! ఇంత చిన్న అమ్మాయి తీసుకొచ్చి.. మహేశ్ తో రొమాన్స్ చేపిస్తావా.. తేడా కొట్టేలా ఉందే ?

- Advertisement -


Director Rajamouli : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పూర్తి కావొస్తుందని తెలుస్తోంది. దీనికోసం మహేష్ బాబు తన బాడీని బిల్డప్ చేసుకునేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. అందులో భాగంగానే ప్రత్యేకంగా డైట్ కూడా ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా గడ్డం కూడా పెంచేస్తున్నాడు. అఫ్ కోర్స్ రాజమౌళి సినిమా అంటే మామూలు విషయం కాదు.. యాక్టర్ల దగ్గరనుంచి నటనను పిండేస్తాడు.. తనకు కావాల్సింది వచ్చేంత వరకు నలిపేస్తాడు.. ఫర్ ఫెక్ట్ గా వచ్చే వరకు టార్చర్ చేస్తాడు.. కానీ చివర్లో మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

rajamouli mahesh
rajamouli mahesh

కాగా, ఇంతలా క్రేజ్ పెంచేస్తున్న సినిమాలో మహేష్ బాబు సరసన ఏ హీరోయిన్ ను రాజమౌళి బుక్ చేస్తాడా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఫైనల్లీ అది ఇండోనేషియానికి సంబంధించిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అని తేలిపోయింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి పేరు మారు మ్రోగిపోతుంది. ఇండోనేషియా నటి రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ బ్యూటీ కి సంబంధించిన విషయాలపై మహేష్ బాబు అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు .

ఈ బ్యూటీ వయసు 22 సంవత్సరాలని తెలుస్తుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి ఈమె క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు మహేష్ బాబు లాంటి టాప్ హీరోకి ఇలాంటి ఫారెన్ బ్యూటీ ని కరెక్ట్ అన్న కామెంట్స్ కూడా వస్తు్న్నాయి. అయితే మహేష్ బాబు వయసు 48 ఏళ్లు. ఈ బ్యూటీ వయసు 22 ఏళ్లంటే మహేష్ వయసులో దాదాపు సగం. మరి అలాంటి బ్యూటీతో రొమాన్స్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయాడని అంటున్నారు అభిమానులు. తేడా కనుక కొడితే రాజమౌళి ఖాతాలో ఫస్ట్ ఫ్లాప్ పడ్డట్లే అని ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here