Ravanasura : 2 రోజుల వసూళ్లు.. డివైడ్ టాక్ తో ఇదేమి అరాచకం సామీ!

- Advertisement -

Ravanasura : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ మూవీ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది.రవితేజ పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో నటించిన సినిమా కావడం వల్లే ఈ టాక్ కి కారణమని అంటున్నారు విశ్లేషకులు.టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం దంచి కొట్టేసింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటి రోజు నాలుగు కోట్ల 25 లక్షల రూపాయిలు వచ్చాయి.

Ravanasura
Ravanasura

ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని,ఇది రవితేజ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.వరుసగా రెండు సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న హీరో కాబట్టే వసూళ్లు బాగా వచ్చాయని,లేకుంటే ఆ టాక్ కి అంత వసూళ్లు వచ్చేవి కాదని అంటున్నారు.

teja

అయితే రెండవ రోజు శనివారం అయ్యినప్పటికీ కూడా కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి, ఇదంతా టాక్ ప్రభావం అనే అంటున్నారు ట్రేడ్ పండితులు.మొదటి రోజులో దాదాపుగా 50 శాతం వసూళ్లను మాత్రమే రాబట్టింది.మాములుగా మొదటి రోజులో 70 శాతం వసూళ్లు ఉంటేనే మంచి హోల్డ్ ఉన్నట్టు,50 శాతం కి పడిపోయింది అంటే, లాంగ్ రన్ ఇక ఉండదని అర్థం అంటున్నారు ట్రేడ్ పండితులు.

- Advertisement -
raviteja

వాళ్ళ లెక్కల ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు రెండు కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 24 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి.’రావణాసుర‘మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి.మూడవ రోజు కూడా కలిపితే పది కోట్ల రూపాయిలు అవ్వొచ్చు.దాని పైన ఇంకా 14 కోట్లు వసూలు చేస్తే కానీ బయ్యర్స్ సేఫ్ అవ్వరు, సమ్మర్ మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు,మరి సమ్మర్ సేవ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here