Ravi Teja : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా, ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ సంక్రాంతికి సినిమాలు ఓవర్ లోడ్ అవ్వడం వల్ల థియేటర్స్ సమస్య ఏర్పడింది. దీంతో ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ అప్పట్లో అన్నీ సంక్రాంతి సినిమాలకు సంబంధించిన దర్శకులతో, నిర్మాతలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని నిర్వహించి, ఈగల్ సినిమాని సంక్రాంతి నుండి తప్పించేలా చేసారు.

సంక్రాంతి రేస్ నుండి తప్పించే ముందు ఫిల్మ్ ఛాంబర్ మీ సినిమాకి సోలో రిలీజ్ డేట్ దొరికేలా చెయ్యడం మా బాధ్యత అంటూ మాట ఇచ్చింది. ఆ ఒప్పందం మీదనే ఈగల్ సినిమా సంక్రాంతి నుండి తప్పుకొని ఫిబ్రవరి 9 వ తేదికి వాయిదా పడింది. అయితే ఈ డేట్ లో మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి.

అందులో ఒకటి సందీప్ కిషన్ హీరో గా నటిస్తున్న ‘ఊరి పేరు భైరవ కోన’ కాగా, మరొక్కటి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్ సలాం’ అనే చిత్రం. ఈ రెండు చిత్రాలు ‘ఈగల్ ‘ సినిమా విడుదల అయ్యే రోజే రాబోతున్నాయి. దీంతో ఫైర్ అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, మా సినిమా విడుదలైనప్పుడు సోలో విడుదల తేదీ రప్పించేలా చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు అది జరగడం లేదు.

మీరిచ్చిన మాటని నిలబెట్టుకొని, దయచేసి ఆ రెండు సినిమాలను రేస్ నుండి తప్పించేలా చెయ్యండి అంటూ ఫిలిం ఛాంబర్ కి లీగల్ నోటీసులు పంపించారు. దీని పై ఫిలిం ఛాంబర్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. అయితే సంక్రాంతి కి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి థియేటర్స్ సమస్య ఉంటుంది. ఫిబ్రవరి 9 వ తేదీ వచ్చే సినిమాలు చిన్నవే కదా, రవితేజ కి కావాల్సినన్ని థియేటర్స్ దొరుకుతాయి, నిర్మాతలు ఇంత రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరం లేదని కొందరి వాదన.