Raja Saab : ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ బడ్జెట్ ఇంత తక్కువనా..! నిర్మాత రిస్క్ తీసుకోవడం లేదా?



Raja Saab : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ కావాలి. అప్పట్లో ఆయన మామూలు తెలుగు హీరో కాబట్టి మామూలు బడ్జెట్ ఉండేది. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుండి ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాలే.

Raja Saab
Raja Saab

అన్నీ ఫ్లాప్ అయ్యాయి కానీ, రీసెంట్ గా విడుదలైన ‘సలార్’ మూవీ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘కల్కి 2898 AD’ చిత్రం కూడా భారీ బడ్జెట్ చిత్రమే. ఇలా వరుసగా ఆయన పాన్ ఇండియన్ సినిమాలే చేస్తూ వెళ్తుండడం తో, అభిమానులు వింటేజ్ ప్రభాస్ మాస్ ని మిస్ అయిపోతున్నారు. అందుకే అలాంటి ఫ్యాన్స్ కోసం ఆయన డైరెక్టర్ మారుతీ తో ‘రాజాసాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు.

Raja Saab Maruthi

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ని చూసి అభిమానుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బుజ్జిగాడు, మిర్చి నాటి ప్రభాస్ ని మళ్ళీ ఇక చూడలేం ఏమో అని అనుకుంటున్న సమయం లో ప్రభాస్ ఈ లుక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతుంది.

Raja Saab Movie

కానీ ఈ సినిమాకి కార్చేస్తున్నా బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయిలు మాత్రమేనట. ప్రభాస్ ఈ సినిమా కి ముందుగా ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోకుండా చేస్తున్నాడట. ప్రభాస్ ని చూసి మిగిలిన ఆర్టిస్టులు కూడా అదే అనుసరించారట. సినిమా విడుదలై వచ్చిన లాభాలతోనే వాటాలు పంచుకుందామని అన్నాడట ప్రభాస్. అలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.