Ravi Teja : రవితేజ నటించిన ఆ బ్లాక్​బస్టర్ మూవీ రీ రిలీజ్

- Advertisement -

Ravi Teja : రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్​కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ వంటి సూపర్ స్టార్ల సినిమాలే రిలీజ్ అయ్యాయి. రీ రిలీజ్​లకు మంచి స్పందన రావడంతో పాటు వసూళ్లు కూడా వస్తుండటంతో ఇతర నిర్మాతలు కూడా వారి సినిమా రికార్డ్స్​లో ఉన్న బ్లాక్​బస్టర్ హిట్స్​ను.. ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాల లిస్టు బయటకు తీస్తున్నారు. వాటిని మళ్లీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్ మహారాజ రవితేజ నటించిన ఓ మూవీని కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Ravi Teja
Ravi Teja

ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్​లో చేరిన మాస్ మహారాజ కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ధమాకా ఎఫెక్ట్​ను ఇంతకుముందు రవితేజతో పని చేసిన నిర్మాతలు వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఈ ఊపులోనే రవితేజ నటించిన బ్లాక్​బస్టర్ సినిమాలు రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమా. రవితేజ హీరోగా హరీశ్​ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్​, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -
Mirapakay

జనవరి 12వ తేదీ 2011వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అప్పట్లో మిగతా అన్ని సినిమాలతో పోటీపడి సంక్రాంతి విన్నర్​గా నిలిచింది. రవితేజ సరసన రీచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. నాగబాబు, అజయ్, బ్రహ్మాజీ, రావు రమేశ్​, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు ఇతర కీలకపాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్​గా నిలవడమే కాదు.. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అప్పట్లో 114 కేంద్రాల్లో 50 రోజులపాటు విజయవంతంగా నడిచిన ఈ సినిమాను జనవరి 26వ తేదీన రీ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఆ రోజున రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మిరపకాయ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పాల నిర్మించారు. అయితే ఇలా రవితేజ సినిమాని రీ రిలీజ్ చేయడం వెనుక కారణం  ధమాకా సూపర్ హిట్ కావడమే అని తెలుస్తోంది. డిసెంబర్ ఆఖరిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించడమే కాకుండా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

సంక్రాంతి సీజన్​లో రెండు భారీ తెలుగు సినిమాలు రెండు తమిళనాడు డబ్బింగ్ సినిమాలు ఒక చిన్న సినిమా బరిలో ఉన్నా సరే ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది.  థియేటర్లన్నింటిలో హౌస్ ఫుల్ అవుతూ నిర్మాతలకు షాక్ కలిగిస్తోంది. రవితేజ మిరపకాయ సినిమాని మరోసారి తెరమీదకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here