Kajol : ఛీ ఇదేం బుద్ధి.. భర్త లేని టైమ్​లో కాజోల్​కు కిస్​ పెట్టిన నటుడు.. థ్యాంక్స్​ చెప్పిన బ్యూటీ!

- Advertisement -

Kajol : బాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ కొత్తేం కాదు. కానీ పెళ్లైన హీరోయిన్లు లిప్ లాక్ అంటే కొందరు వెనకడుగేస్తారు. కొన్నిసార్లు హీరోయిన్లు వెనక్కి తగ్గితే.. మరికొన్ని సార్లు వాళ్లతో ఆ సీన్లలో నటించడానికి తోటి నటులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఓ నటుడికి అలాంటి సమస్యే ఎదురైందట. అయితే ఆ యాక్టర్ ఆ హీరోయిన్ భర్త లేని సమయంలో ఆ సీన్ లో నటించాడట. ఇంతకీ ఎవరా యాక్టర్.. హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా..?

Kajol
Kajol

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌కు బ్రిటిష్‌-పాక్‌ నటుడు అలీ ఖాన్‌ ఫ్రెంచ్ కిస్ పెట్టారట. కాజోల్ అంటే తనకు చాలా ఏళ్ల నుంచి క్రష్ ఉందని చెప్పుకొచ్చిన అలీ ఖాన్‌.. ప్రస్తుతం ఆమెతో కలిసి ‘ది గుడ్‌ వైఫ్‌’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌ ఇంగ్లీష్‌లో వచ్చేయగా.. తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Kajol and Alyy Khan

ఈ సిరీస్‌లో కాజోల్, అలీ ఖాన్ లవర్స్‌గా నటిస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్ ఫేమ్ సుపర్న్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా కాజోల్, అలీ ఖాన్‌ మధ్య ఓ లిప్‌ లాక్ సీన్ ఉందట. దాంతో తొలుత అలీ ఖాన్ భయపడినా.. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ లేని సమయంలో ఆ సీన్‌ను చిత్రీకరించినట్లు ఈ బ్రిటిష్‌-పాక్‌ నటుడు చెప్పుకొచ్చారు.

- Advertisement -
Kajol Ajay and Alyy Khann

“ముంబయిలోని ఓ హోటల్​లో ఆ సీన్​ను షూట్​ చేశాం. అంతకు ముందు నేను చాలా టెన్షన్​ పడ్డాను. కాసేపు చూయింగ్​ గమ్​ కూడా నమిలాను. రెండు మూడు సార్లు ప్రాక్టీస్​ కూడా చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రొఫెషనల్​ యాక్టర్స్​లా ఆ సీన్​ను పూర్తి చేశాం. ఆమెనా క్రష్. ఆ విషయాన్ని ఆమెకు ముందే చెప్పడం వల్ల మరింత టెన్షన్​ భయపడ్డాను. కానీ సీన్ తొందరగా పూర్తి చేయడం వల్ల కాజోల్​ ‘థ్యాంక్యూ డార్లింగ్​’ అని చెప్పి నవ్వేశారు.”

— అలీ ఖాన్​, బ్రిటిష్​-పాక్​ నటుడు

కాజోల్​ భర్త అజయ్​ దేవగణ్​.. వరుసగా సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తున్నారు. తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాను ‘భోళా’ పేరుతో హిందీలో అజయ్​ దేవగణ్​ రీమేక్​ చేస్తున్నారు. అందులో సీనియర్​ నటి టబు పోలీస్​ ఆఫీసర్​గా కనిపించబోతున్నారు.ఇటీవలే కాజోల్ సలామ్ వెంకీ సినిమాతో అలరించారు. అందులో ఓ వ్యాధితో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఓ కొడుకును కాపాడుకునే తల్లిగా నటించింది. ఈ పాత్రలో కాజోల్ ఎంతో మెచ్యూర్డ్ గా నటించి విమర్శకు ప్రశంసలు అందుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కాజోల్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటోంది. ఎక్కువగా ఈ బ్యూటీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది. మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ డిజిటల్ మీడియాలో తన సత్తా చాటుతోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here