Rashmika Mandanna : ఫ్యాన్స్ ఎదుట రష్మిక డ్యాన్స్.. దిష్టి తీసిన విజయ్‌.. వీడియో వైరల్

- Advertisement -

Rashmika Mandanna : ‘రంజితమే రంజితమే’.. ‘వారిసు’ సినిమాలోని ఈ సాంగ్ గత కొంతకాలంగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటను స్వయంగా ఇళయదళపతి విజయ్ పాడటం మరో ప్రత్యేకత. ఈ సాంగ్ కు విజయ్, రష్మిక మందన్న వేసిన స్టెప్పులు ఇప్పటికీ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేసిన తీరు చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో Rashmika Mandanna ఇటీవల లైవ్‌లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. ఈ ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు నటుడు విజయ్‌ రష్మికను మెచ్చుకొంటూ దిష్టి తీశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Rashmika Mandanna and Vijay
Rashmika Mandanna and Vijay

విజయ్‌ – రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఇటీవల ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుక చెన్నైలో వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాజాగా ‘వారిసు’ ఆడియో ఫుటేజీని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ మాట్లాడుతూ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఆయా నటీనటులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

దిల్‌రాజు మంచి వ్యక్తి అని, దర్శకుడు వంశీ టేక్‌ వెంటనే ఓకే చేయరంటూ విజయ్ సరదాగా నవ్వులు పూయించాడు. రష్మిక మంచి నటి అని, తెరపైన బయటా ఒకేలా ఉంటుందని మెచ్చుకుంటూ ఆమెకు దిష్టి తీశాడు. అనంతరం అభిమానులను ఉద్దేశిస్తూ.. ఎన్నో ఏళ్ల నుంచి తనను ప్రేమిస్తోన్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పాడు.

- Advertisement -

అభిమానులను తాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని అన్నాడు. ‘‘జీవితంలో ఎలాంటి విషయమైనా సరే మీతో మీరే పోటీ పడండి. అలా పోటీ పడినప్పుడే మీరు మరింత వృద్ధి చెందుతారు’’ అంటూ అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు విజయ్.

ఇదే వేడుకల్లో కొరియోగ్రాఫర్‌ జానీతో కలిసి ‘రంజితమే’ పాటకు రష్మిక స్టెప్పులేసి అలరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘గిల్లి’ తర్వాత నుంచి నేను విజయ్‌కు వీరాభిమానిని అయిపోయాను. ఆయన నటించిన సినిమాలు చూస్తూ ఈలలు వేసి గోల చేసేదాన్ని. ఆయనతో యాక్ట్‌ చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. సినిమా షూట్‌ జరిగినన్ని రోజులు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నా. సెట్‌లో ఉన్నంతసేపు ఆయన్నే చూస్తూ.. నవ్వుతూ ఉండేదాన్ని. విజయ్‌ సర్‌.. మీతో మళ్లీ సినిమా చేసే అవకాశం వచ్చినా ఇలాగే చూస్తూ ఉండిపోయేలా ఉన్నాను. లైక్‌ యూ సర్‌’’ అని చెప్పింది.

https://twitter.com/MandannaTeam/status/1609790850103668736?cxt=HHwWgMDT8fiPkNcsAAAA

‘‘విజయ్‌ సినిమాకి మ్యూజిక్‌ అందించాలనే నా కోరిక 27 ఏళ్లకు తీరింది. ఈ క్షణాలను నేను ఎన్నటికీ మర్చిపోను’’ అంటూ సంగీత దర్శకుడు తమన్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here